ఆ సమస్య వల్లే రాజకీయాలకు దూరమైన రామ్మూర్తి.. తమ్ముడంటే బాబుకు అంత ఇష్టమా?
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇంట విషాదం నెలకొన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు తమ్ముడు రామ్మూర్తి నాయుడు మృతి చెందారనే వార్త టీడీపీ అభిమానులను ఎంతో బాధ పెడుతోంది. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్ లోని ప్రముఖ ఆస్పత్రిలో చేరిన రామ్మూర్తి నాయుడు చికిత్సకు కోలుకోలేక మృతి చెందారు. 1994 సంవత్సరంలో టీడీపీ నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో పోటీ చేసిన రామ్మూర్తి నాయుడు ఎమ్మెల్యేగా గెలిచారు.
రామ్మూర్తి నాయుడు భార్య పేరు ఇందిర కాగా ఈ దంపతులకు నారరా రోహిత్, గిరీష్ కుమారులు. నారా రోహిత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడిగా మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. రామ్మూర్తి నాయుడు మృతి గురించి నారా రోహిత్ పీఆర్వో నుంచి అధికారికంగా ప్రకటన వెలువడింది. తమ్ముడంటే చంద్రబాబుకు ఎంతో అభిమానమని తెలుస్తోంది. తమ్ముడికి ఎలాంటి కష్టం రాకుండా చంద్రబాబు చాలా సందర్భాల్లో అండగా నిలిచారని సమాచారం.
రామ్మూర్తి నాయుడు అల్జీమర్స్ ఉందని ఇతర సమస్యల వల్ల గత కొన్నేళ్లుగా మంచానికే పరిమితమయ్యారని ఆరోగ్య సమస్యలే ఆయన పాలిటిక్స్ కు దూరం కావడానికి కారణమని సమాచారం. చంద్రబాబు నాయుడు మహారాష్ట్ర పర్యటనను రద్దు చేసుకుని హైదరాబాద్ కు రానున్నారని తెలుస్తోంది. 1990లో టీడీపీలో అత్యంత చురుకైన నేతగా రామ్మూర్తి నాయుడికి గుర్తింపు ఉండేది.
1999 ఎన్నికల్లో రామ్మూర్తి నాయుడు ఓటమిపాలు కాగా తర్వాత రోజుల్లో చంద్రబాబుతో కొన్ని విషయాల్లో రామ్మూర్తి నాయుడు విబేధించారు. 2003లో కాంగ్రెస్ లో చేరిన ఆయన 2006లో మళ్లీ టీడీపీలో చేరారు. మరికొన్ని రోజుల్లో నారా రోహిత్ పెళ్లి జరగాల్సి ఉండగా ఇలాంటి సమయంలో ఇలాంటి సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. రామ్మూర్తి నాయుడు ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. టీడీపీ నేతలు, అభిమానులు ఏఐజీ ఆస్పత్రికి రామ్మూర్తి నాయుడి భౌతిక కాయాన్ని చూడటానికి వెళ్తున్నారని తెలుస్తోంది.