ఏపీ: మరో ఆరు కొత్తఎయిర్‌పోర్టులు..ఎక్కడెక్కడ అంటే..?
కుప్పంలో 1501 ఎకరాల భూమిని, నాగార్జునసాగర్లో 1670 భూమి,తాడేపల్లిగూడెంలో 1123 ఎకరాల భూమి, అన్నవరంలో 787 ఎకరాలు, శ్రీకాకుళంలో పలాస డివిజన్లో సైతం 1383 ఎకరాల భూమిని.. అలాగే ఒంగోలులో 657 ఎకరాలు ఉన్నట్లుగా గుర్తించారట. ఇందుకు సంబంధించి పనులు కూడా శరవేగంగా చేసేలా ఎన్డీఏ ప్రభుత్వం పలు రకాల నిర్ణయాలను తీసుకున్నారు. దీనికి మొత్తం మీద రూ .1.92 కోట్ల రూపాయలను నిధులను రిలీజ్ చేసినట్లుగా సమాచారం..ఇవే కాకుండా గడిచిన రెండు రోజుల క్రితం జాతీయ రహదారులను విస్తీర్ణం చేసే విధంగా కూడా కూటమి ప్రభుత్వం ఈ విషయాన్ని బిజెపి ఎంపీ సీఎం రమేష్ కూడా తెలియజేశారు.
జాతీయా రహదారుల విస్తరణకు కూడా కేంద్ర ప్రభుత్వం మరొకసారి ఏపీ ప్రభుత్వానికి గుడ్ న్యూస్ తెలియజేసింది. అనకాపల్లి బిజెపి ఎంపీ సీఎం రమేష్ ఈ విషయాన్నీ సైతం తెలియజేశారు. ముఖ్యంగా ఏ ఏ ప్రాంతాలలో అంటే.. రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి.. అలాగే రాయచోటి నుంచి కడప జాతీయ రహదారులకు సైతం విస్తరణకు సైతం కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలియజేశారు సీఎం రమేష్. ఇందులోనే రాజమహేంద్రవరం నుంచి అనకాపల్లి వద్ద వరకు ఉన్న నాలుగు వరసల రహదారిని సైతం ఆరు వరసలు విస్తరింప చేసేలా చూస్తారట. ఇదే కాకుండా పలు జాతీయ రహదారులను కూడా విస్తరింప చేసేలా కూటమి ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది.