గోదావ‌రి సాక్షిగా వైసీపీకి వ‌రుస షాకులు ... !

RAMAKRISHNA S.S.
- ( గోదావ‌రి - ఇండియా హెరాల్డ్ ) . .
గోదావరి సాక్షిగా వైసీపీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. ఇప్పటికే గత ప్రభుత్వంలో సలహాదారు గా ఉన్న కొవ్వూరు నియోజకవర్గం వైసీపీ సమన్వయకర్త చలుమోలు రాజీవ్ కృష్ణ తో పాటు పలువురు జడ్పిటిసిలు - ఎంపీపీలు టీడీపీ లో చేరారు. తాజాగా నిడదవోలు పురపాలిక చైర్మన్ భూపతి ఆదినారాయణ తో పాటు వైస్ చైర్మన్ గంగుల వెంకటలక్ష్మి తో పాటు పదిమంది కౌన్సిలర్లు వైసీపీకి రాజీనామా చేశారు. వీరంతా వివిధ కారణాలతో తాము వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి వేణుగోపాలకృష్ణకు లేఖలు పంపారు. వీరితోపాటు మరికొందరు కౌన్సిలర్లు కూడా త్వరలోనే వైసీపీని వీడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రాజీనామా చేసిన వారంతా జనసేన లో చేరెందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు.

పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లి తిరిగి వచ్చిన వెంటనే .. వీరు జనసేనలో చేరనున్నారు. వ‌రుస రాజీనామాల పరంపరతో నిడదవోలులో మున్సిపాలిటీలో వైసిపి బలం ఒక్కసారి పడిపోయింది. 2015లో జరిగిన ఎన్నికలలో పట్టణంలో ఉన్న 28 వార్డులకు 27 చోట్ల వైసిపి అభ్యర్థులు విజయం సాధించారు. ఇక నిడదవోలు నుంచి ప్రస్తుతం మంత్రిగా ఉన్న జనసేన నేత కందుల దుర్గేష్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ క్రమంలోనే ప్రతిపక్ష వైసీపీ లో ఉంటే ఉపయోగం లేదని ... జనసేనలో చేరితే అభివృద్ధికి నిధులు తెచ్చుకోవచ్చన్న ఆశతో మీరంతా వైసీపీని విడినట్టు తెలుస్తోంది.

అలాగే 2014 ఎన్నికలలో నిడదవోలు నుంచి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన రాజీవ్ కృష్ణ కూడా తాజాగా తెలుగుదేశం పార్టీలో చేరడంతో .. వీరంతా వైసీపీలో ఉన్న ఉపయోగం లేదన్న నిర్ణయానికి వచ్చి ఆ పార్టీని విడినట్టు తెలుస్తోంది. ఏదేమైనా గోదావ‌రి వైసీపీ కి మ‌రిన్ని షాకులు త‌ప్పేలా లేవు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: