రెడీ గా ఉన్న వైసీపీ నేతలు..! చంద్రబాబు వెనకడుగు వేస్తున్నారా..?
అయితే.. ఈ క్రమంలో అసలు నేరస్తులు వేరే ఉన్నారన్నది రాజకీయంగా జరుగుతున్న చర్చ. అంతేకా దు.. అప్పటి వైసీపీ మంత్రులు కొందరు ఉన్నారన్నది కూడా టీడీపీ నాయకులు బహిరంగంగా విమర్శ లు చేస్తున్నారు. అయితే.. పక్కా ఆధారాల కోసం పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆధారాలు లేకుండా తూతూ మంత్రంగా కేసులు పెడితే.. రేపు వారు న్యాయపోరాటం చేసితప్పించుకునే అవకాశం ఉంటుంద న్నది చంద్రబాబు కూడా చేస్తున్న ఆలోచన.
ఈ నేపథ్యంలోనే ఇలాంటి వారిపై పక్కా ఆధారాలతోనే చర్యలకు రెడీ అవుతున్నారు. ఇదిలావుంటే.. అసలు వైసీపీ కి చెందిన కొందరు మాజీ మంత్రులు ఇప్పటికిప్పుడు చంద్రబాబు ప్రభుత్వం తమను అరెస్టు చేసినా రెడీ అంటూ కామెంట్లు చేస్తున్నారు. విశాఖ జిల్లా అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, గుంటూరు జిల్లా సత్తెన పల్లి మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అంబటి రాంబాబు వంటివారు బహిరంగ ప్రకటనలే చేస్తున్నారు.
అంటే.. అరెస్టు అయ్యేందుకు వారు మానసికంగా రెడీ అయ్యారు. ఇక, చంద్రబాబు నిర్ణయం, పోలీసుల నిర్ణయమే తరువాయి అన్నట్టుగా ఉన్నారు. అయినప్పటికీ.. సర్కారు మాత్రం వారి జోలికి ఇప్పట్లో వెళ్లేందుకు సిద్ధంగా లేదు. దీనికి కారణం వారు ఈ అరెస్టులను అడ్డు పెట్టుకుని సింపతీ రాజకీయాలు చేసే అవకాశం ఉందని చంద్రబాబు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరికొన్ని రోజులు వెయిట్ చేసి.. పక్కా ఆధారాలు సాధించాక చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అప్పటి వరకు వీరు ఎంత తొందరపడినా అరెస్టు చేయకపోవచ్చని తెలుస్తోంది.