ఏపీ: సీమ విషయంలో చంద్రబాబు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారా..?

Divya
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ విషయంలో వ్యవహరిస్తున్న తీరు అక్కడ ప్రజలను తీవ్ర ఆగ్రహాన్ని గురయ్యేలా చేస్తోంది. కూటమి  ప్రభుత్వం రాయలసీమకు వ్యతిరేకంగా విధానాల పైన కూడా అక్కడ ప్రాంత ప్రజలు ఒక్కసారిగా రగిలిపోతున్నారు. గత ఐదో నెలలో చంద్రబాబు సీఎం కు పదిసార్లు అన్యాయం చేశారని బాధ అక్కడి ప్రాంత ప్రజలతో పాటు నేతలలో కూడా ఉన్నదట. ముఖ్యంగా వైసీపీ జిల్లాలో కొప్పర్తిలో 250 కోట్లతో ఒక పరిశ్రమను కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే వాటిని అమరావతికి తీసుకు వెళ్లేందుకు ఏపీ సీఎం ఉత్తర్వులను జారీ చేశారట.

అంతేకాకుండా ఇటీవలే కడప నుంచి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకును అందుకు సంబంధించి ప్రధాన కార్యాలయాన్ని కూడా అమరావతికి తీసుకు వెళ్లడానికి కూటమి ప్రభుత్వం పైన పలు రకాల ప్రయత్నాలు చేస్తోందని బ్యాంకు ఉద్యోగ సంఘాలు కూడా ఫైర్ అవుతున్నారట. చంద్రబాబు అధికారంలోకి వచ్చారు అంటే రాయలసీమ నుంచే ప్రజలు పట్టం కట్టడం వల్లే వచ్చారని గుర్తుంచుకోవాలని ప్రజలు కూడా హెచ్చరిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం రాయలసీమ ప్రజలకు ఇంత అన్యాయం చేస్తున్నారేంటి అంటూ  ప్రజలతోపాటు యువత కూడా అడుగుతోంది. ప్రతి ఏడాది 20 లక్షలు ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పిన కూటమి ప్రభుత్వం పరిశ్రమలను ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారంటూ వాపోతున్నారు.

రాయలసీమకు వస్తున్న కొత్త పరిశ్రమలతో పాటుగా పాత పరిశ్రమలను ప్రభుత్వ కార్యాలయాలకు సంబంధించిన వాటి అన్నిటినీ కూడా రాజధాని ప్రాంతాలకు తరలిస్తూ ఉండడంతో సీమ పైన ఎందుకు సీఎం చంద్రబాబుకు కక్ష అంటూ మరి కొంతమంది నేతలు తెలుపుతున్నారు.రాయలసీమ అంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్న చూపు అంటే ప్రజా సంఘాలు కూడా విమర్శిస్తూ ఉన్నారు. అంతేకాకుండా రాబోయే రోజుల్లో కచ్చితంగా రాయలసీమ ప్రజలు కూడా ఉద్యమ బాట పట్టే పరిస్థితి ఏర్పడేలా ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ విషయాన్ని ఏపీ సీఎం చంద్రబాబు దృష్టిలో పెట్టుకొని మళ్ళీ ఇలాంటి తప్పులు చేయకుండా చూస్తారేమో చూడాలి మరి. ఇదే కొనసాగితే కచ్చితంగా 2019 ఎన్నికల ఫలితాలు మళ్లీ ఎదురవుతాయని పలువురు విశ్లేషకులు తెలుపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: