ఏపీ: చంద్రబాబు పాలన చూసి జగన్ నేర్చుకోవాల్సిందేనా..?

Divya
ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు తాను చెప్పినటువంటి హామీలను నెరవేర్చాలని మేనిఫెస్టో అంటే ఒక భగవద్గీత , బైబిల్, ఖురాన్ గా భావిస్తానని తాను చెప్పిన హామీలలో 90 శాతం అమలు చేశానని ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలను అందించానని వాలంటరీ సైన్యాన్ని తయారు చేసుకున్నారని మధ్యవర్తులు కమిషన్ లేకుండా బటన్ నొక్కి డైరెక్ట్ గా ప్రజల అకౌంట్లోకి డబ్బులు వేశానని ఏ ప్రభుత్వం చేపట్టని రీతిలో సంక్షేమ పథకాలను చేశానని కరోనా కష్టకాలంలో కూడా అందరికీ అండగా నిలిచానని మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. అయినప్పటికీ కూడా 2024 ఎన్నికలలో వైసీపీ చాలా ఘోరంగా ఓడిపోయింది. చివరికి కూటమి విజయాన్ని అందుకుంది.

అయితే ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే రేడ్ బుక్ ఓపెన్ చేస్తామని అందులో రాసిన వారి పేర్లు అన్ని కూడా తాము సరిచేస్తామని టిడిపి పార్టీ ఎన్నికల ముందు ప్రకటించింది. అలాగే అధికారం చేపట్టి ఇప్పుడు చెలరేగిపోతున్నట్లుగా కనిపిస్తోంది. ముఖ్యంగా వైసిపి పార్టీ పేరు ఎత్తితే చాలు కూటమి ప్రభుత్వం చర్యలు చేపడుతున్నట్లు కనిపిస్తోందట. వైసిపి పార్టీ కానీ ఆ పేర్లు కానీ వినిపించిన సరే కచ్చితంగా వారిని వేధించడమే పనిగా పెట్టుకున్నారు కూటమి ప్రభుత్వం.

అందుకే సోషల్ మీడియాలో బూతులు తిడుతున్నారని బరితెగించడం వంటివి టిడిపి పార్టీకి తెలియని పని కాదు కానీ.. కానీ ఈ విషయం పైన అటు టిడిపి పార్టీ ప్రస్తుతం నీతులు చెబుతూ ఉందని పలువురు నేతలు ఫైర్ అవుతున్నారు. ముఖ్యంగా షర్మిల కూడా తమను వైసీపీ పార్టీ సంబంధించిన సోషల్ మీడియా వేధిస్తోంది అంటూ తెలియజేస్తోంది. కానీ ఇదే షర్మిల టిడిపి పార్టీ నేతలు మీడియా ముఖంగా చేసిన వ్యాఖ్యల పైన మాత్రం మాట్లాడలేదు. వైసిపి పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఆయన భార్యను అనరాని మాటలు అని.. అనైతిక సంబంధాలను అంటగడుతూ అలాగే సినిమాలను కూడా తీస్తూ పలు రకాల పోస్టర్లు పెట్టడం జరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ టీడీపీ పార్టీ నీతులు చెబుతోంది అంటూ పలువురు ప్రజలు కూడా మండిపడుతున్నారు.

.
పరిపాలన అంటే ఇలా ఉండాలి అంటు టిడిపి నేతలు వైసిపి పార్టీని ఎద్దేవా చేస్తున్నారు. అధికారం లభించగానే ప్రజలకు డబ్బులు వేస్తే ఇక తనే దిక్కు అన్నట్టుగా ఫీల్ అవ్వడం కాదు.. అధికారం దక్కిన తర్వాత ఏం చేయవచ్చు .. పార్టీకి శాశ్వత పునాదులు వేసుకోవడానికి ఏం చేయాలి అనే విషయాన్ని టిడిపి పార్టీ ఇప్పుడు చాటి చెబుతోంది. కూటమిలో భాగంగా టిడిపి పార్టీ కాస్త బలం సంభవించిందని చెప్పవచ్చు. ఈ విషయాన్ని మరొకసారి పదిలంగా మార్చుకోవడానికి చూస్తోంది. అందుకే టిడిపి జెండా కార్యకర్త నుంచి నేతల వరకు ప్రతి ఒక్కరు కూడా జేబులు నింపుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేతలు చెప్పిందే వేదంగా అధికారులు కూడా చేస్తున్నారు. పదేళ్లు కాపాడుకున్న పునాదులను జగన్ ఐదేళ్లలో కూల్చేశారని.. ఇప్పుడైనా వైసిపి నేత జగన్ అన్నిటిని గమనించి సరైన నిర్ణయాలు తీసుకోవాలని పలువురు కార్యకర్తలు తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: