ఏపీ: ఇక పై రోడ్డు ఎక్కితే టోల్ గేట్స్.. కూటమికి దెబ్బేనా..?
అయితే ఇప్పుడు టిడిపి కూటమి రోడ్ల విషయంలో ఒక నిర్ణయాన్ని తీసుకుందట .అదేమిటంటే ప్రభుత్వం దగ్గర ఖజానా లేకపోవడంతో గుంతలు సైతం పూడ్చడానికి సుమారుగా 1000 కోట్లకు పైగా అవుతుందని ప్రభుత్వం మంజూరు చేసిందట. ప్రస్తుతమైతే ఈ పనులు సాగుతున్నాయట.కానీ రోడ్డు గట్టిగా పదిలంగా ఉండాలి అంటే వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంత డబ్బు ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర లేకపోవడంతో అటు మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎం చంద్రబాబుతో ఒక నిర్ణయాన్ని ప్రతిపాదన తీసుకువచ్చినట్లు తెలుస్తోంది.
అంతేకాకుండా గ్రామాలలో మండలాలలో కూడా రోడ్లన్నిటిని కూడా అవుట్సోర్సింగ్ ఏజెంట్లకు ఇచ్చేస్తామని ప్రతిపాదన తీసుకువచ్చారు. అయితే దీనిని టోల్ ఫీజు చెల్లింపు ద్వారా వారికి ఇవ్వబోతున్నట్లు తెలుపుతున్నారు. కార్లు ,బస్సులు వంటి వాహనాలు మాత్రమే తీసుకుంటారని బైకులు, ట్రాక్టర్లు ,ఆటోలకు టోల్ ఫ్రీజ్ ఉండదని వెల్లడించారు. అయితే గ్రామాలలో మండలాల్లో అసలు టోల్ ఫిజ్ ఉంటుందా లేదా అన్నది ఇంకా క్లారిటీగా తెలపలేదు. అయితే ఈ టోల్ ఫిజ్ అన్న పదం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతట వ్యాపించడంతో చాలామంది కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.. ఇప్పటికే హైవేల మీద టోల్ ఫీజులతో అధిక భారంతో ఇబ్బంది పడుతున్న ప్రజలు ఇప్పుడు మళ్లీ కొత్త టోల్ ఫిజ్ అంటే భారంగా మారుతుందని తెలియజేస్తున్నారు. ముఖ్యంగా బస్సులలో ప్రయాణించే సామాన్యుల పైన కూడా టోల్ ఫీజు భారం పడుతుందని. అలాగే లారీలకు పెడితే వారి నుంచి కూడా నిరసనలు వ్యక్తం అవుతాయని తెలియజేస్తున్నారు. ఇక కార్ల విషయంలో కూడా ఇదే జరుగుతుందని పలువురు ప్రజలు కూడా విమర్శిస్తున్నారు. మరి ఏ మేరకు ఇది సక్సెస్ అవుతుందో చూడాలి.