భళా భాగ్యనగరం.. బెంగుళూరు, ముంబై కాదు హైదరాబాదే నెం.1.. సర్వేలో కీలక రిపోర్ట్?

praveen
రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ నైట్ ఫ్రాంక్ తాజాగా చేసిన ఒక స్టడీలో హైదరాబాద్‌ నగరం ఇండియాలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా నిలిచింది. భారతదేశంలో అత్యుత్తమ సిటీ కూడా ఇదే అని సదరు సంస్థ సర్వేలో తేలింది. వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరంగా హైదరాబాద్ నే ఎందుకు ఎంపిక చేశారో తెలుసుకుందాము. ఈ సర్వే జీవన సౌలభ్యం, ఆదాయం, ఉపాధి, ఆరోగ్యం, విద్య, రియల్ ఎస్టేట్ విలువ, భౌతిక మౌలిక సదుపాయాలు, పాలన వంటి ప్రమాణాలను పరిగణలోకి తీసుకొని ఆరు ప్రధాన మెట్రో ప్రాంతాలలో హైదరాబాద్ బెస్ట్ అని తేల్చింది.
కొన్ని వర్గాల్లో వేరే మెట్రో సిటీలో టాప్ ప్లేస్ లో నిలిచినా హైదరాబాద్ ఓవరాల్ గా టాప్ సిటీగా నిలిచింది. రియల్ ఎస్టేట్ ధరలు భాగ్యనగరంలో బాగా పెరుగుతున్నాయి. ధనికులందరూ ఇక్కడికే తరలివస్తున్నారు అంతేకాదు ఇక్కడ బాగా పెట్టుబడులు పెడుతున్నారు. అందుకే హైదరాబాద్ బాగా డెవలప్ అవుతుంది. ఇక బెంగళూరు వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో రెండవ స్థానంలో నిలిచింది. ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పిలుచుకునే బెంగళూరులో చాలా నైపుణ్యం గల ఉద్యోగులు ఉన్నారు. వ్యాపార వాతావరణం ఇక్కడ అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఈ నగరం అభివృద్ధి చెందుతూనే ఉంది. బెంగళూరులో ప్రధాన నగరాల్లో నిరుద్యోగిత రేటు చాలా తక్కువగా ఉంది. ఇక్కడ 100 కి 76 మంది ఏదో ఒక ఉద్యోగం చేస్తూనే ఉన్నారు.
నైట్ ఫ్రాంక్ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గులామ్ జియా మాట్లాడుతూ "ప్రపంచ ఆర్థిక శక్తిగా భారతదేశం ఎదుగుతోంది అంటే దానికి కారణం హైదరాబాద్ బెంగళూరు నగరాలే అని చెప్పారు. ముంబై అన్ని అంశాలలో మంచి పర్ఫామెన్స్ కనబరిచిందని కూడా పేర్కొన్నారు. ఇది భారతదేశం ఆర్థిక రాజధానిగా ఇప్పటికీ నిలుస్తోంది. గురుగ్రామ్, నోయిడా వంటి ప్రాంతాలతో సహా ఢిల్లీ-NCR మౌలిక సదుపాయాలు, పాలనలో ముందుంది. స్టార్టప్ రంగంలో బెంగళూరు కొన్ని సమస్యలను ఫేస్ చేస్తున్నా ఎకనామిక్‌గా స్ట్రాంగ్‌గానే ఉంది. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్, రవాణా మౌలిక సదుపాయాల్లో భారీ పెట్టుబడులు పెట్టడం వల్ల ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీగా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: