ఎస్..! ఆ టీడీపీ ఎమ్మెల్యే నెంబర్ 1 విజనరీ లీడరే...!
తాజాగా ఏలూరి సాంబశివరావుకు బ్రిటన్ పార్లమెంట్ విజనరీ లీడర్ అవార్డు ప్రకటించింది. బ్రిటన్ పార్లమెంట్ వేదికగా ఏలూరి సాంబశివరావుకు ఈ అవార్డును ప్రకటించడం గమనార్హం. అసెంబ్లీ సమావేశా ల దృష్ట్యా ఆయన లండన్ వెళ్లలేకపోవడంతో.. ఆయన తరఫున బ్రిటన్ ఎన్ఆర్ఐ టీడీపీ వ్యవహారాల నేత గోపాల్ అవార్డును అందుకున్నారు. ఇక, టీడీపీలో ఉన్న 134 మంది ఎమ్మెల్యేల్లో ఒక్క ఏలూరికి మాత్రమే ఈ అవార్డు లభించడం గమనార్హం.
అభినందనల వెల్లువ ...
‘విజనరీ లీడర్ ’ అవార్డు సాధించిన ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు.. అభినందనలు వెల్లువెత్తుతు న్నాయి. సీఎం చంద్రబాబు ప్రస్తుతం సోదర వియోగంలో చాలా బాధలో ఉన్నారు. అయినప్పటికీ.. ఏలూరికి ఫోన్ చేసి అభినందించారు. అరుదైన గౌరవం దక్కిందని కితాబిచ్చారు. ఇక, మంత్రులు అనగాని సత్యప్రసాద్, అచ్చెన్నాయుడు, గొట్టిపాటి, డీబీవీ స్వామి, కొల్లు రవీంద్ర, రాం ప్రసాద్‌రెడ్డి తదితరులు సాంబశివరావుకు ఫోన్ చేసి ప్రశంసించారు. .
కష్ట జీవి ...
ఏలూరి విషయాన్ని పరిశీలిస్లే.. ప్రతికూల రాజకీయ వాతావరణం నెలకొన్న 2019 ఎన్నికల్లోనూ విజయం దక్కించుకున్నారు. ప్రజలకు తలలో నాలుకగా వ్యవహరించే ఏలూరి మట్టి మనిషిగా పేరు తెచ్చుకున్నా రు. సాధారణ వ్యక్తిగా ఉండే ఆయన హంగు ఆడంబరాలకు కడు దూరంగా ఉంటారు. సమస్య ఎక్కడుంటే తాను అక్కడకు వెళ్లడం ఆయనకు రాజకీయంగా అబ్బిన తొలి లక్షణం. ఇవే ఆయనను సామాన్యులకు కనెక్ట్ చేశాయి.. అవార్డులు తీసుకువచ్చాయి.