ఏపీ: అభిమానులు కన్నా కళను నిరాశపరిచిన పవన్ కళ్యాణ్.. సీఎంగా నో ఛాన్స్..!

Divya
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆయన కార్యకర్తలు నేతలు సైతం సీఎంగా చూడాలని ఎన్నో కలలు కన్నారు. పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ సీఎం అవుతానని ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కానీ తాజాగా ఆయన మాట్లాడిన మాటలు చూస్తే జనసేన పార్టీ నేతలు సైన్యం డీలా పడిపోయేలా కనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ పార్టీ స్థాపించినప్పటి నుంచి ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకుని ముందుకు వెళ్తున్నారు. 2019లో సింగల్ గా జనసేన నుంచి పోటీ చేసిన ఓడిపోవడం జరిగింది. 2024లో కూటమితో జతకట్టి భారీ విజయాన్ని అందుకున్నారు.
ఇదంతా ఇలా ఉంటే ఇటీవలే పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రకటనలను చూసి ఆయన అభిమానులు కార్యకర్తలు నేతలు సైతం డీలా పడిపోయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. నిండు శాసనసభలో చంద్రబాబు ఐదు కాదు మరో పదేళ్లపాటు సీఎంగా ఉండాలంటూ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అంటే ఈ ఐదేళ్లతో పాటుగా మరొక పదేళ్లు కూటమి విచ్చిన్నం చెందకుండా ఉంటుంది అన్నమాట. ముఖ్యంగా రాజకీయాలలో సీఎం సింహాసనం చేపట్టాలని చాలామందికి ఆశ ఉంటుంది. సీఎం గా ఉండడం అంటే అది చాలా భారంగా కూడా ఉంటుందని చెప్పవచ్చు.

ఎన్నో ఏళ్లుగా పవన్ కళ్యాణ్ ని సీఎంగా చూడాలని అభిమానులు కలలు కంటునప్పటికీ శాసనసభలు మాట్లాడిన మాటలతో అవి నీరు కారిపోయాయి. పవన్ కళ్యాణ్ వెంట ఉంటూ ఆయన కాపు కాస్తూ ఉన్న నేతలు కార్యకర్తలు కూడా 10 ఏళ్ల పాటు సీఎం గా చంద్రబాబు ఉండాలని చెప్పడంతో ఏమాత్రం రుచిపడడం లేదట. ఒకవేళ పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఫ్యూచర్ ఇలాగే ఉంటే ఆయన ఎప్పటికీ కూడా సీఎం కాలేరని కార్యకర్తలు వాపోతున్నారు. ఇప్పటికే పొలిటికల్ప రంగా చూసుకుంటే సామాజిక వర్గాల మధ్య చీలిపోయి ఉంది.. ముఖ్యంగా కమ్మవారు చంద్రబాబు సైడు, రెడ్లు మొత్తం జగన్ సైడు, పవన్ కళ్యాణ్ కి కాపులు మద్దతు ఉందని ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్లకు ఒక బలమైన సామాజిక వర్గం కూడా ఏం చేయాలో అర్థం కావడం లేదట. మరి రాబోయే రోజుల్లో ఈ విషయం ఎంతవరకు వెళ్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: