మహారాష్ట్ర ఎన్నికలు: పవన్ ప్రచారం చేసిన చోట దుమ్ములేపిన బీజేపీ ?

Veldandi Saikiran

మహారాష్ట్రలో ఇవాళ ఉదయం నుంచి కౌంటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే ఎగ్జిట్ ఫలితాలు ఎలా వచ్చాయో రిజల్ట్ కూడా అచ్చం అలాగే వస్తున్నాయి. మహారాష్ట్రలో బిజెపి కూటమి అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మహారాష్ట్రలో మహా యుక్తి కూటమికి ప్రజలు పట్టం... కట్టే ఛాన్సులు ఉన్నాయి. ప్రస్తుత ట్రెండ్స్ చూస్తుంటే...బిజెపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి మరోసారి రాబోతుంది.
ఇప్పటి వరకు పూర్తయిన కౌంటింగ్ లో... మహారాష్ట్రలో బిజెపి కూటమికి 220 స్థానాలు  దక్కేలా కనిపిస్తున్నాయి. 220 స్థానాలలో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. అటు కాంగ్రెస్ కూటమికి 55 స్థానాలు ఆధిక్యం కనిపిస్తున్నాయి. అది మరింత తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక ఇతరులు 13 స్థానాలలో.. ముందంజలో కనిపిస్తున్నారు.

ఈ నేపథ్యంలో... ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహారాష్ట్ర ఎన్నికల సమయంలో... జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... ఏపీ డిప్యూటీ హోదాలో... ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అయితే తెలుగు వారు ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం జరిగింది. అయితే మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ తో... ప్రచారం చేయించిన బిజెపి సక్సెస్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

మహారాష్ట్రలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన ప్రతి చోటా బీజేపీ ఆదిక్యం లో ఉంది. మహారాష్ట్రలోని బల్లార్ పూర్, పూణే, డెగ్లూరు, సోలాపూర్, లాతూర్,లాంటి ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్... ప్రచారం చేశారు.  ఈ అన్ని స్థానాల్లో బిజెపి పార్టీ ముందు అందులో దూసుకు వెళ్తోంది. మరి కాసేపట్లో ఇక్కడ అభ్యర్థులకు కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయట. దీంతో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడంతోనే బిజెపి అక్కడ గెలుస్తోందని జనసేన నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. కాగా మహారాష్ట్రలో ఇప్పటికే మేజిక్‌ ఫిగర్‌ కూడా దాటేసింది బీజేపీ కూటమి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: