ఆ టీడీపీ ఎమ్మెల్యేతో క‌డ‌ప రెడ్డ‌మ్మ ఢీ.. ఈ పంచాయితీ ఎందుకు .. ?

RAMAKRISHNA S.S.
- ( రాయ‌ల‌సీమ‌ - ఇండియా హెరాల్డ్ ) . .
వైయస్సార్ జిల్లాలో జిల్లా కేంద్రమైన కడప ఎమ్మెల్యే రెడ్డప్ప గారి మాధవి రెడ్డి చాలా తక్కువ టైంలోనే ఫైర్ బ్రాండ్ లీడర్ గా మంచి పేరు తెచ్చుకున్నారు. తర్వాత జిల్లా కేంద్రమైన కడపలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసిన మాధవి రెడ్డి లేడీ ఫైర్ బ్రాండ్ గా దూసుకుపోతున్నారు. అసెంబ్లీలోను .. బయట తన బలమైన వాయిస్ వినిపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆమెకు మహిళా కోటాలో మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఇది ఇలా ఉంటే మాధవి రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్య రెడ్డి కుటుంబం మధ్య అధిపత్య‌ పోరు నడుస్తోంది. ఇందులో భాగంగానే ఇటీవ‌ల అసెంబ్లీ సమావేశాలలో కడప నగరంలోని బిల్డప్ ఏరియాలో మార్పు పేరుతో డి అడిక్షన్ సెంటర్ మెడపై నిర్వహిస్తుంటే దాని కింద మద్యం దుకాణం ఉందనే ప్రస్తావన మాధవరెడ్డి తీసుకువచ్చారు. కమలాపురం ఎమ్మెల్యే వర్గీయుడి మద్యం దుకాణాన్ని అక్కడ నుంచి తప్పించడమే ఆమె ఎత్తుగడగా కడ‌ప పులో చర్చ జరిగింది. కడపలో కమలాపురం టిడిపి నేత పుత్తా నరసింహారెడ్డి పెత్తనం ఏంటి ? అనేది మాధవి రెడ్డి ప్రశ్న.

అయితే కడపలో పుత్తా కుటుంబానికి వ్యాపారాలు ఉన్నాయి. కడపలో మాధవి రెడ్డి ఎవరో ఇటీవల తెలుసని తాను చాలా యేళ్ల‌ నుంచి వ్యాపారాలు చేసుకుంటున్నాం .. అనేది పుత్తా కుటుంబం వాదన. అయితే కడపలో తన మాటే శిలాశాసనం అని మాధవి రెడ్డి భావిస్తుండటం వల్లే ఈ సమస్య ఉత్పన్నమైంది టిడిపి నేతలు చెబుతున్నారు. బిల్డప్ సమీపంలో కమలాపురం ఎమ్మెల్యే అనుచరుడు మద్యం దుకాణం ఏర్పాటు చేయటం మాధవి రెడ్డికి నచ్చలేదని అంటున్నారు. అందుకే బడి - గుడి నిబంధనలు తెరమీదకు తెచ్చి ఆ మద్యం దుకాణం ఉన్నచోట నుంచి దానికి కొంచెం దూరంలో ఉన్న ప్రాంతానికి పంపగలిగారు. అయితే అక్కడ కూడా లేకుండా చేసేందుకు దుకాణం ఏర్పాటు చేసిన భవనానికి మున్సిపల్ అనుమతులు లేవంటూ అధికారులతో నోటీసులు ఎమ్మెల్యే ఇప్పించారు. అయితే భవనాలకు అనుమతులు ఉన్నాయని ... సంబంధిత భవనం యజమాని చూపించారు. దీంతో కమలాపురం టిడిపి నేత మున్సిపల్ అధికారులపై ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారట. అధికారులు మాత్రం మధ్యలో నలిగిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: