ఇండియాలో.. రైల్వే స్టేషన్ లేని ఏకైక రాష్ట్రం ఇదే.. ఎందుకు లేదో తెలుసా?

praveen
మన భారతదేశం అత్యంత ఎక్కువ రైల్వే నెట్‌వర్క్‌ను కలిగి ఉన్న దేశం అని అనడంలో ఎటువంటి సందేహం లేదు . అలాంటి మన భారత దేశంలో రైల్వే లైన్లు లేని ఒక రాష్ట్రం కూడా ఉంది అన్న విషయం మీకు తెలుసా..? అవును మీరు విన్నది నిజమే .. ఈ రాష్ట్రం మన హిమాలయాల ఒడిలో కూడా ఉంది . ఇక మన సినిమా వాళ్ల ఫేమస్‌ లోకేషన్‌ పాయింట్‌ కూడా ఇదే అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అంతే కాకుండా సినిమాలలో మంచు కొండల్లో పాట చేయాలి అని అనగానే మనవాళ్లు ముందుగా వెళ్ళేది కూడా ఈ ప్రదేశానికె అదే సిక్కిం. ఈ రాష్ట్రం చూడటానికి చాల అందంగా ఉంటుంది అని అందరికి తెలిసిన విషయమే.
సిక్కింలో ఉండే ప్రకృతికి ఎంతటి వారైనా సరే పరవశించిపోవాల్సిందే. అంతలా ఆ రాష్ట్రము  ముగ్ధుల్ని ఆకర్షిస్తుంది . అలాగే పర్యాటకులు తాకిడి ఎక్కువగా ఉండే ఈ రాష్ట్రానికి ఎందుకు రైల్వే సౌకర్యం లేదు అన్న విషయానికి వస్తే ..అక్కడ ప్రతికూల వాతావరణమే ఇందుకు ఒక ముఖ్యమైన కారణం అనే చెప్పాలి. అలాగే ఈ ప్రదేశంలో భూభాగంలో అనేక రకాల ప్రకృతి సవాళ్లు కూడా ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఎక్కువగా నిటారుగా ఉండే లోయలు, ఇరుకైన మార్గాలు, ఎత్తైన పర్వతాల ఉండడంతో అక్కడ రైల్వే లైన్లు నిర్మిచడం కుదరలేదు. అంతే కాకుండా ఆ ప్రాంతంలో ఎప్పడూ కూడా  కొండచరియలు విరిగి పడడం లాంటి ప్రమాదాలు ఎక్కువ. ఇలా అనేక  పరిస్థితుల వాళ్ళ ఇప్పటి వరుకు  రైల్వే నిర్మాణం ఏర్పాట్లు చేయడనికి కుదరలేదు. కానీ ప్రస్తుతం అక్కడ పరిస్థితి క్రమంగా మారె అవకాశాలు ఉన్నాయి. ఈ తరుణంలో మోదీ అక్కడ రైల్వే స్టేషన్‌కు శంకుస్థాపన కూడా చేసారు. కానీ అది ఇంకా నిర్మాణ దశలో ఉన్న ఈ సిక్కిం రంగ్‌పో స్టేషన్‌ను టూరిజం, డిఫెన్స్‌ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తామని  రైల్వే మేనేజర్‌ అమర్జీత్‌ అగర్వాల్‌ తెలిపారు. చూడాలి మరి అక్కడ రైల్వే లైన్ ఏర్పాటు చేసిన కానీ ట్రైన్ పరుగులు పెట్టె విదంగా వాతావరణం సహకరిస్తుందో లేదో మరి,  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: