మహారాష్ట్ర ఎన్నికలు: బిజెపిని గెలిపించింది ఆ పథకమేనా..?
అందులో షిండే ప్రభుత్వం ప్రవేశపెట్టిన లడ్కి బహిన్ పథకం అక్కడ ప్రజలను బాగా ఆకట్టుకుందట. మహాయుతి ప్రభుత్వం ఏర్పడితే ఈ పథకాన్ని ముందుకు తీసుకువెళ్తామని మహిళలకు ఈ పథకం బాగా అవసరం పడుతుందని ఎన్నికల ముందు ప్రచారంలో బాగా తీసుకువెళ్లారు. మరి ఈ పథకమే అక్కడ బిజెపి గెలవడానికి ముఖ్య కారణమైందని మహారాష్ట్ర ఎన్నికల ముఖచిత్రాన్ని మార్చేసిందనే విధంగా వినిపిస్తున్నాయి.. మరి ఆ లడ్కి బహిన్ యోజన పథకం ఏంటి వాటి వల్ల మహిళలకు ఎలాంటి ఉపయోగముందో చూద్దాం.
ఎన్నికల ప్రచారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే .. మహిళలకు సంబంధించి లాడ్లీ బహిన్ యోజన స్కీమ్ హైలెట్ గా నిలిచిందట ఇందులో భాగంగా అర్హులైన ప్రతి మహిళలకు కూడా ప్రతి నెల రూ .1500 మహిళలకు అందిస్తున్నామని.. మళ్లీ ప్రభుత్వం ఏర్పడితే ఈ మొత్తాన్ని 2100 రూపాయలకు పెంచుతామంటూ తెలిపారుట ఏకానాథ్ షిండే..ఈ పథకానికి సంబంధించి బడ్జెట్ కూడా 46 వేల కోట్ల రూపాయలు కేటాయించారు. అలా ఈ పథకం వల్లే అక్కడ మహిళా ఓటర్లు సైతం ఎక్కువగా ఓట్లు వేయడానికి ఆసక్తి కలవరిచ్చిందని తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈసారి మహారాష్ట్ర ఎన్నికలలో మహిళలు చాలా విభిన్నమైన రికార్డును సృష్టించారట.. ఆరు కోట్ల 44 లక్షల 888 వేల 195 మంది ఓటర్లు ఉన్నప్పటికీ.. ఇందులో మహిళలే మూడు కోట్ల ఆరు లక్షల 49 వేల 318 మంది మహిళ ఓటర్స్ వినియోగించుకున్నారట. మహిళలు ఇంత పెద్ద సంఖ్యలో ఓట్లు వేయడం మొదటిసారి అన్నట్లుగా సమాచారం. ప్రతి మహిళకు కూడా రూ .3000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వడంతోనే ఇక్కడ మహాయుతి మంచి విజయాన్ని అందుకున్నదట. ముఖ్యంగా 20 మంది మహిళ నేతలను గెలిపించడానికి కారణమయ్యిందట.