ఈవీఎంలపై విమర్శలకు చెక్ పెట్టిన ప్రియాంక గెలుపు.. మాయా మర్మం లేనట్టేనా?

Reddy P Rajasekhar
ఈ మధ్య కాలంలో ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా ఈవీఎంలపై విమర్శలు సాధారణం అవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో ఎన్నికల ఫలితాలు ఊహించని విధంగా వెలువడటం ఈవీఎంల విషయంలో అనుమానాలకు కారణమని చెప్పవచ్చు. అయితే ఈవీఎంలపై విమర్శలకు ప్రియాంక గెలుపు చెక్ పెట్టిందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈవీఎంల విషయంలో మాయామర్మం లేనట్టేనని ప్రూవ్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 
ఈవీఎంలను అనేవాళ్లు ప్రియాంక ఎలా గెలిచిందో చెప్పాలని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీల నుంచి ఎలాంటి అనుమానాలు వ్యక్తమైనా ప్రియాంక గాంధీ గెలుపు గురించి ఈ సందర్భంగా ప్రశ్నలు వ్యక్తమయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఈవీఎంలను కాంగ్రెస్ తప్పుబడితే జార్ఖండ్ లో అధికారం ఎలా దక్కిందనే ప్రశ్నలు వ్యక్తమవుతాయి.
 
ఈవీఎంల విషయంలో సామాన్యుల్లో సైతం నెలకొన్న అనుమానాలకు ఈ ఎన్నికల ఫలితాలు చెక్ పెట్టాయని కచ్చితంగా చెప్పవచ్చు. రాబోయే రోజుల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు గెలుపు కోసం మరింత కష్టపడే అవకాశాలు అయితే ఉంటాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన ప్రతి సందర్భంలో ఈవీఎంల విషయంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో కోర్టును ఆశ్రయించినా ఫలితం లేకుండా పోతుంది.
 
బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగాలని పలు పార్టీలు కోరుకుంటున్నా సాధ్యమయ్యే అవకాశం అయితే కనిపించడం లేదు. బ్యాలెట్ పద్ధతిలో ఎన్నికలు జరగడం వల్ల ఫలితాల విషయంలో తప్పు జరగడానికి అవకాశం లేదని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రియాంక గాంధీ గెలుపు కాంగ్రెస్ పార్టీకి ఎంతమేర ప్లస్ అవుతుందనే చర్చ సోషల్ మీడియాలో జరుగుతోంది. ప్రియాంక గాంధీ జాతీయ రాజకీయాలపై దృష్టి పెడితే బాగుంటుందని చెప్పవచ్చు. కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చేలా చేయడంలో ప్రియాంక గాంధీ కీలక పాత్ర పోషిస్తారేమో చూడాల్సి ఉంది. దేశ రాజకీయాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయం కాంగ్రెస్ అవుతుందో లేక మరో పార్టీ అవుతుందో తెలియాల్సి ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: