సిగరెట్ తాగొద్దు అన్నందుకు.. టెన్త్ విద్యార్థి ఏం చేశాడో తెలుసా?

praveen

ఈ రోజుల్లో పిల్లల ప్రవర్తన చాలా ఆందోళనకరంగా కనిపిస్తోంది. స్కూల్ కెళ్లే వయసులోనే పిల్లలు తాగుడుకు అలవాటు పడుతున్నారు. లవ్ అంటూ తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అన్ని చెడు అలవాట్లను అలవర్చుకొని తల్లిదండ్రులకు తీవ్ర నిరాశను మిగుల్చుతున్నారు. తల్లిదండ్రులు ఏదైనా అంటే చాలు బాగా అలుగుతున్నారు. అన్నం తినకుండా ఇళ్లలో నుంచి బయటికి వెళ్లి పోతున్నారు. కొందరైతే ఏకంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి విషాదకరమైన, తల్లిదండ్రులని కలచివేసే సంఘటన సిరిసిల్ల జిల్లా, కోనరావుపేట మండలంలోని ఓ గ్రామంలో చోటుచేసుకుంది.
ఈ గ్రామంలో పదో తరగతి చదువుతున్న పదహారేళ్ల బాలుడు సిగరెట్లకు అలవాటు పడ్డాడు. తండ్రి మందలిస్తే తీవ్ర మనస్థాపానికి లోనై గడ్డిమందు తాగాడు. అయితే అప్రమత్తమైన పేరెంట్స్ ఆసుపత్రికి తీసుకెళ్లి అతన్ని కాపాడారు కానీ అప్పటినుంచి ఈ బాలుడు ఎవరితో మాట్లాడకుండా ఒంటరిగా గడుపుతున్నాడు. ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి దూరంగా ఉంటూ ఇంకా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. సిగరెట్ తాగొద్దని తండ్రి తన మంచికే మందలించాడని తెలుసుకోలేకపోయాడు.
ఎవరితో మాట్లాడకపోవడం వల్ల అతనిలో సూసైడల్‌ థాట్స్ మొదలయ్యాయి. ఇక తాను ఈ భూమి మీద బతికి ఏం లాభం లేదని భావించాడు. అందుకే శుక్రవారం రోజు ఎవరూ లేని సమయంలో దూలానికి ఊరేసుకొని చనిపోయాడు. తండ్రి ఇంటికి వచ్చి చూస్తే కొడుకు దూరానికి వేలాడుతూ విగత జీవిగా కనిపించాడు. దాంతో ఆయన గుండె పగిలాడు. సిగరెట్ తాగొద్దని మందలించినందుకు తాను ఇలా చనిపోతాడని అతను అసలు ఊహించలేదు. ఈ విషయం తెలిసి గ్రామం అంతా కూడా షాకైంది. స్థానికులలో విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. పిల్లలను ఎప్పుడూ ఓ కంట కనిపెట్టుకొని ఉండాలని, బాధలో ఉన్నట్లు అనిపిస్తే వెంటనే దగ్గరికి తీసుకొని ఆప్యాయత చూపించాలని పోలీసులు సూచించారు.
పిల్లలను చెడు సవాసాలు, చెడు అలవాట్లు బారిన పడకుండా ఎప్పుడూ వారిని పర్యవేక్షిస్తూ ఉండాలని పేర్కొన్నారు. అయితే ఎదిగొచ్చిన కొడుకు చనిపోయాడని తండ్రి తట్టుకోలేక ఏడుస్తుంటే స్థానికులు అందరూ కంటతడి పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: