ఏపీ: రేషన్ కార్డు లేని వారికి గుడ్ న్యూస్..!

Divya
ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డు లేని వారికి తాజాగా కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలియజేసింది.. కొత్త రేషన్ కార్డులు జారీ చేసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రజలను సిద్ధంగా ఉండాలని తెలియజేశారు. డిసెంబర్ 2 నుంచి 28వ తేదీ వరకు రేషన్ కార్డుల కోసం ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని అర్హులైన వారికి రేషన్ కార్డులు అందిస్తున్నామని తెలిపారు.. ఇప్పటికే రాష్ట్రంలో 3.30 లక్షల దరఖాస్తులు సైతం పెండింగ్లో ఉన్నాయని కొత్తగా రేషన్ కార్డుల కోసం మరో 30000 మంది దరఖాస్తులు చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే యాడింగ్ కోసం2,13,007 మంది దరఖాస్తులు ఉన్నారని తొలగించిన వారు 36,000 మందికి పైగా ఉన్నారని తెలిపారు.

అయితే ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డుల స్థానంలో కొత్త రేషన్ కార్డులను సైతం తీసుకువచ్చేందుకు ఏపీ ప్రభుత్వ చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తోంది. ఈమెరకు ఒక కొత్త డిజైన్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. ప్రస్తుతం కార్డులో వైఎస్ బొమ్మలతో పాటు జగన్ ,ఆకుపచ్చ నీలం తెలుపు రంగులతో రేషన్ కార్డులు కలవు ఈ బొమ్మలు తొలగించడంతో పాటుగా రంగులు కూడా మార్చి సరికొత్త డిజైన్తో తీసుకురాబోతున్నారట. అలాగే రేషన్ కార్డులో రాష్ట్రంలో ఉండే అనర్హులను సైతం తొలగించి అర్హులకు రేషన్ కార్డు మంజూరు చేస్తామంటూ తెలిపారు.

పౌరసరఫరాల శాఖ ప్రకారం 17,941 అంత్యోదయ అన్న యోజన కార్డులు ఉన్నాయని.. వీరితో పాటుగా 1,36,420 PHHFH కార్డులు కూడా కలవని వీరు గత ఆరు నెలలుగా రేషన్ తీసుకోలేదంటూ తెలియజేశారు. వీరిని తొలగిస్తే సుమారుగా 90 కోట్లు ఆదా అవుతుందని ఏపీ ప్రభుత్వం అంచనా వేస్తోందట. ఇప్పటికే 1.48 కోట్ల వైట్ రేషన్ కార్డులు ఉన్నాయని ఇందులో 90 లక్షల కార్డులు జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఉన్నవని తెలిపారు. వీరికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యం ఇస్తుందని అలాగే తక్కువ ధరకే కందిపప్పు పంచదార కూడా అందిస్తుందని తెలిపారు.
మొత్తానికి కొత్త రేషన్ కార్డులు వివాహమైన వారు లేదా ఎవరైనా సరే కొత్త రేషన్ కార్డుకు అప్లై చేసుకోవాలనుకుంటే డిసెంబర్ 2వ తేదీ నుంచి 28 వరకు అవకాశం ఉంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: