బీఆర్ఎస్కు కల్వకుంట్ల కవిత దూరమేనా... హింట్ ఇస్తోందిగా...?
- సొంత ఎజెండా తో రాజకీయం మొదలు పెట్టిన వైనం .. !
- ( హైదరాబాద్ - ఇండియా హెరాల్డ్ ) . .
కల్వకుంట్ల కవిత బీఆర్ఎస్ పార్టీ నీడ నుంచి బయటకు వచ్చేశారా ? ఇకపై ఆమెకు బీఆర్ ఎస్ కు సంబంధం లేదా ? బీఆర్ ఎస్తో సంబంధం లేకుండా కవిత కొత్త రాజకీయం మొదలు పెట్టబోతున్నారా ? అంటే అవును అన్న సంకేతాలే ఇప్పుడు తెలంగాణ రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కవిత విషయానికి వస్తే తాజాగా ఆమె నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఫుడ్ పాయిజన్‌కు గురైన హాస్టల్ విద్యార్థులను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. వారితో పాటు కవిత వెళ్లకుండా ఆమె సొంతంగా వెళ్లారు. తనతో పాటు కొంత మంది జాగృతి నేతలను కూడా కవిత తన వెంట తీసుకెళ్లారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో ఎక్కడా బీఆర్ఎస్ ప్రస్తావన తీసుకురాకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకున్నారు... అయితే పార్టీ తో సంబంధం లేకుండా తెలంగాణ ప్రభుత్వంపై మాత్రం విమర్శించారు.
ఢిల్లీ లిక్కర్ కేసులో బెయిల్ వచ్చిన తర్వాత కవిత సైలెంటుగా ఉంటూ తన రాజకీయం తాను చేసుకుంటోన్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనారోగ్య కారణాల తో పాటు సరైన టైం కోసం ఆమె ఎదురు చూపులు చూస్తున్నట్టుగా చెపుతున్నారు. దానికి తగినట్టుగానే ఆమె అడుగులు పడుతున్నాయి. అదానీ ఇష్యూ బయటకు రాగానే ఆమె తనదైన స్టైల్లో ట్వీట్లు చేశారు. తర్వాత రోజు బయటకు వచ్చిన రాజకీయాలకు దూరమయ్యేందుకు ఆమె సిద్దంగా లేరని టాక్ ? అయితే ఇక్కడే ట్విస్ట్ కూడా ఉంది... బీఆర్ఎస్ కాకపోతే సొంత రాజకీయం చేస్తారని ... కూడా తెలంగాణ లో రాజకీయంగా ఇప్పుడు ప్రధానంగా వినిపిస్తోన్న హాట్ టాపిక్ ?
ఇక కవిత తన భారత జాగృతిని.. మళ్లీ తెలంగాణ జాగృతిగా మార్చారు. అలాగే ఆమె త్వరలోనే బీసీ రిజర్వేషన్లపై పోరాటం చేయబోతున్నారు. తర్వాత మరో టాపిక్ అందుకునేలా ఆమె ఎత్తుగడలు ఉండబోతున్నాయట. ఇవన్నీ బీఆర్ఎస్ కన్నా. భిన్నంగా ఉండబోతున్నాయి అన్నది క్లీయర్ కట్ గా తెలిసిపోతోంది. చివరికి ఎన్నికల వరకూ ఆమె జాగృతి నేతగానే రాజకీయాలు చేసే అవకాశం ఉంది... ఆమె అడుగులు అలాగే ఉండబోతున్నాయి. బీఆర్ఎస్కు దూరం కావడం వెనుక బీఆర్ఎస్ ఫ్యామిలీలో అంతర్గతంగా ఏం జరిగిందన్న దానిపై ఆసక్తికర చర్చ అయితే ఇప్పుడు మొదలు అయ్యింది.