పోలీసులకు దొరక్కుండా చుక్కలు చూపిస్తున్న ఆర్జీవీ..!

FARMANULLA SHAIK
వివాదాల వర్మ రాంగోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన వివాదాలు సినిమాలకే పరిమితం అనుకుంటే తప్పే.ఎందుకంటే ఇప్పుడు అతని సినిమాల వివాదం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.
రామ్ గోపాల్ వర్మ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఉద్దేశించి వ్యూహం అనే సినిమాను తెరకెక్కించారు. ఈ మూవీ విడుదల చేయడానికి ప్రభుత్వాలు ఒప్పుకోలేదు. కానీ దీని విడుదల కోసం వర్మ చాలా కష్టపడ్డాడు. ఇందులో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశిస్తూ పలు కీలక సన్నివేశాలను తీశాడు. పైగా ఈ మూవీ ప్రమోషన్స్ కోసం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వారిపై ఇన్‌డైరెక్ట్‌గా సెటైర్లు వేశాడు. ఇన్‌డైరెక్ట్‌గా మాత్రమే కాకుండా డైరెక్ట్‌గా వారి పేర్లను ఉపయోగించి కూడా ట్రోల్ చేశాడు. ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి రావడంతో ఆర్జీవీపై యాక్షన్ తీసుకోవాలని ఆయన ఫిక్స్ అయ్యి నోటీసులు జారీ చేశారు.గత రెండు పర్యాయాలు విచారణ నుంచి తప్పించుకున్న వర్మను ఈసారి విచారణ కాకుండా డైరెక్ట్ గా అరెస్ట్ చేసేందుకు సిద్దమయ్యారు పోలీసులు. ప్రకాశం జిల్లా ఒంగోలు గ్రామీణ పోలీసుల విచారణకు రెండు సార్లు వర్మ తప్పించుకోవడంతో అతని అరెస్ట్ కోసం హైదరాబాద్ వెళ్ళారు పోలీసులు.ఇదిలావుండగా సినిమాలతో సోషల్ మీడియా పోస్ట్ లతో రెచ్చిపోయిన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ బెండ్ తీయడానికి ఏపీ పోలీసులు రెడీ అయ్యారు. సోషల్ మీడియాలో చెలరేగిపోతూ నన్ను ఎవరూ ఏం చేయలేరు అనే ధీమాతో ఎగరేస్తున్న వర్మకు ఏపీ పోలీసులు ముహూర్తం ఫిక్స్ చేసారు. 
టీడీపీ మద్దిపాడు మండల ప్రధాన కార్యదర్శి ముత్తనపల్లి రామలింగం ఆయనపై ఫిర్యాదు చేయగా ఈ కేసులో అరెస్ట్‌ నుంచి రక్షణ కల్పించాలంటూ రామ్గోపాల్వర్మ హైకోర్టును ఆశ్రయించగా ఆ కేసును హైకోర్ట్ కొట్టేసింది.ఈ క్రమంలో వర్చువల్‌ ద్వారా విచారణలో పాల్గొనేందుకు అవకాశం ఇవ్వాలని హైదరాబాద్‌లోని తన లాయర్‌ ద్వారా ప్రకాశంజిల్లా పోలీసులకు సమాచారం ఇచ్చారు వర్మ. ఎఫ్‌ఐఆర్‌ నమోదు కోసం వచ్చిన ఫిర్యాదులోని అంశాలను నోటీస్‌ ద్వారా అటాచ్‌ చేయాలని వర్మ లాయర్‌ బాల పోలీసులను కోరుతున్నారు.మొత్తం మీద ఇటు విచారణకు రాకుండా, అటు ఎక్కడున్నారో తెలియకుండా వర్మ ప్రకాశంజిల్లా పోలీసులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఈ కేసులో తనకు ముందస్తు బెయిల్‌ కావాలంటూ ఏపీ హైకోర్టులో వర్మ వేసిన పిటిషన్‌పై రేపు మంగళవారం విచారణ జరగనుంది. ఒకవేళ వర్మకు బెయిల్‌ వస్తే విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. లేకుంటే తనకు బెయిల్ వచ్చే వరకు వర్మ పోలీసులకు తన సినీ స్టైల్లో ముప్పుతిప్పలు పెట్టే అవకాశం ఉంది. అయినా సరే ప్రకాశం పోలీసులు పట్టువదలని విక్రమార్కుల్లా వర్మను అరెస్ట్‌ చేసేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: