ఏపీ: కూటమిలో డిష్యూం డిష్యూం ..జేసీ వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!

Divya
వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలో కూటమిలో భాగంగా ఇప్పుడు చిచ్చు రేగినట్టుగా కనిపిస్తోంది.. ఎర్రగుంట్ల మండలంలో RTPP నుంచి ప్లేయాష్ తరలింపు విషయం పైన అటు స్థానిక బిజెపి ఎమ్మెల్యే అయిన ఆదినారాయణ రెడ్డి తాడిపత్రి టిడిపి నాయకుడు మాజీ ఎమ్మెల్యే అయినా జెసి దివాకర్ రెడ్డి వర్గీల మధ్య ఒక గొడవ కొనసాగుతోంది.. అయితే ఈ గొడవ అంతా కూడా ఆదాయం కోసమే అన్నట్లుగా అక్కడ కొంతమంది ప్రత్యక్షంగా తెలియజేసినట్లు సమాచారం.. ఇటీవలె బిజెపి ఎంపీ సీఎం రమేష్ చెందిన రిత్విక్ సంస్థ పనులన్నిటిని సైతం ఆదినారాయణ రెడ్డి వర్గీయుల అడ్డుకుంటున్నారట.

సీఎం రమేష్ సంస్థ డిమాండ్ చేస్తున్నటువంటి కొన్ని కాంట్రాక్ట్ పనులను ఇవ్వకపోవడంతో జమ్మలమడుగు ఎమ్మెల్యే వర్గీయుల సైతం కొంతమంది దాడి చేయడానికి తెగించారని దీంతో ఇప్పుడు ఈ విషయం తీవ్ర చర్చనియా అంశంగా మారింది.. అయితే అటు జేసి దివాకర్ రెడ్డి ,ఆదినారాయణ రెడ్డి ఇద్దరు కూడా కూటమి నేతలు కావడం గమనార్హం.. జెసి దివాకర్ రెడ్డి తాడిపత్రి చెందిన నాయకుడు..బిజెపి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కి మధ్య ఫ్లయాష్ తరలింపుకు సంబంధించి విభేదాలు మొదలయ్యాయట.

Rtpp జమ్మలమడుగు నియోజవర్గంలోకి వస్తుందని ఇక తమ పరిధిలో ఏం జరిగినా కూడ తమ పరిధిలో ని జరుగుతుందని భావించిన ఆదినారాయణ రెడ్డి.. అయితే తాడిపత్రి నియోజకవర్గం లో సిమెంట్ పరిశ్రమలకు సంబంధించి RTPP నుంచి దివాకర్ రెడ్డి వర్గీయులు కొంతమంది ఫ్లయాష్ వాహనాలు తరలిస్తూ ఉన్నారని ఒప్పందం కుదరకపోవడంతో దివాకర్ రెడ్డి వాహనాలను సైతం రానివ్వకుండా ఆదినారాయణ రెడ్డి వర్గీయులు అడ్డుపడ్డారట. ఈ విషయం తెలుసుకున్న అటు పోలీసులు బలగాలు భారీగా అక్కడ చేరుకున్నారట సుమారుగా 50 మందికి పైగా పోలీసులు సిఐలు ఆరుగురు ఎస్ఐలతో అక్కడ మోహరించడం జరిగిందట.. రిత్విక్ కంపెనీ యంత్రాలు, ఉద్యోగులపైన ఆదిరెడ్డి వర్గీయులపై దాడి మరువకముందే ఇప్పుడు జెసి దివాకర్ రెడ్డి వర్గాల పైన ఆది అనుచరులు  సైతం దాడి చేసేందుకు సిద్ధం కావడంతో ఇప్పుడు అక్కడ పరిస్థితి ఏం జరుగుతుందో అంటూ కూటమి నేతలు తలలు పట్టుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: