జ‌న‌సేన నుంచి నాగ‌బాబు రికార్డ్‌... చ‌రిత్ర‌లో ఫ‌స్ట్ టైం రికార్డ్‌...!

RAMAKRISHNA S.S.
- ( అమ‌రావ‌తి - ఇండియా హెరాల్డ్ ) . .

ఏపీలో మూడు రాజ్య‌స‌భ స్థానాల‌కు ఉప ఎన్నిక‌ల‌కు కేంద్ర ఎన్నిక‌ల సంఘం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఈ మూడు స్థానాలు కూడా వైసీపీ నుంచి రాజ్య‌స‌భ ఎంపీలుగా గెలిచి వారు రాజీనామా చేసిన‌వే కావ‌డం విశేషం. వైసీపీ నుంచి రాజ్య‌స‌భ ఎంపీలుగా గెలిచిన బీద మ‌స్తాన్ రావు - మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ తో పాటు తెలంగాణ కు చెందిన బీసీ సంఘాల నేత ఆర్‌. కృష్ణ‌య్య సైతం ఎంపీలుగా ఎన్నిక‌య్యారు. అయితే ఈ యేడాది జ‌రిగిన సాధార‌ణ ఎన్నిక‌ల్లో వైసీపీ చిత్తుగా ఓడిపోయింది. ఆ పార్టీకి మొత్తం 11 మంది రాజ్య‌స‌భ స‌భ్యులు ఉన్నారు. పార్టీ ఓడిపోయిన ఐదు నెల‌ల‌కే ఏకంగా ముగ్గురు దూర‌మ‌య్యారు. ఇక తెలుగుదేశం పార్టీ పుట్టాక ఆ పార్టీకి రాజ్య‌స‌భ‌లో ప్రాథినిత్యం లేక‌పోవ‌డం ఇదే ఫ‌స్ట్ టైం. అలాంటిది ఇప్పుడు ఐదు నెల‌ల్లోనే అలా అధికారం వ‌చ్చిందో లేదో వెంట‌నే మ‌ళ్లీ టీడీపీకి రాజ్య‌స‌భ సీటు ద‌క్క‌నుంది.

ఇక ఈ మూడు సీట్ల‌లో రెండు సీట్లు టీడీపీ తీసుకుని ఒక‌టి జ‌న‌సేన‌కు ఇస్తుంద‌ని టాక్ ?  టీడీపీ నుంచి బీదా మ‌స్తాన్ రావుతో పాటు వ‌ర్ల రామ‌య్య పేర్లు దాదాపు ఖ‌రారు అయ్యాయ‌ని అంటున్నారు. వీరిలో బీద మ‌స్తాన్ రావు వైసీపీ నుంచి వ‌చ్చి ఆయ‌న రాజ్య‌స‌భ సీటు వ‌దులు కోగా ఆయ‌న సీటునే తిరిగి ఇప్పుడు ఆయ‌న‌కు ఇస్తున్నారు. ఇక వైసీపీ నుంచే వ‌చ్చి రాజ్య‌స‌భ సీటు వ‌దులుకున్న మాజీ మంత్రి మోపిదేవి వెంక‌ట ర‌మ‌ణ‌కు ఎమ్మెల్సీ ఇస్తార‌ని టాక్ ?  ఇక జ‌న‌సేన కు ఇచ్చిన సీటు నుంచి నాగ‌బాబు ఎంపీ కాబోతున్నార‌ట‌. నాగ‌బాబు జ‌న‌సేన నుంచి ఎంపీగా వెళితే జ‌న‌సేన నుంచి రాజ్య‌స‌భ‌కు వెళ్లిన తొలి ఎంపీగా ఆయ‌న రికార్డుల్లోకి ఎక్కుతారు. అలా జ‌న‌సేన హిస్ట‌రీలో తొలి రాజ్య‌స‌భ ఎంపీ అయిన క్రెడిట్ ఆయ‌న పేరు మీద ఉండిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: