టీడీపీ 5 నెలల పాలన రివ్యూ ఇదే.. బాబు, పవన్ పాలనపై ప్రజల రియాక్షన్ ఇదే!
మరోవైపు పవన్ కళ్యాణ్ సైతం ఏపీలో శాంతి భద్రతల కోసం ఎంతో కష్టపడుతున్నారనే సంగతి తెలిసిందే. బాబు, పవన్ పాలన విషయంలో ప్రజలు మాత్రం పూర్తిస్థాయిలో సంతృప్తితో ఉన్నారని కామెంట్లు వ్యక్తమవువుతూ ఉండటం గమనార్హం. కొన్ని విషయాల్లో కూటమి పాలనపై విమర్శలు వ్యక్తమవుతున్నా గతంలో ఎప్పుడూ ప్రతిపక్ష పార్టీ నేతలను టార్గెట్ చేయని స్థాయిలో టార్గెట్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఈ ఒక్క విషయంలో మాత్రం కూటమి సర్కార్ పై నెగిటివ్ ప్రచారం జరుగుతోంది. కూటమి సర్కార్ రాబోయే రోజుల్లో ఏ విధంగా ముందుకెళ్లనుందో చూడాల్సి ఉంది. ఏపీలో కూటమికి తిరుగులేదని భవిష్యత్తులో సైతం మూడు పార్టీలు కలిసి పోటీ చేయాలని కామెంట్లు వినిపిస్తున్నాయి. 2014 మ్యాజిక్ 2024 సంవత్సరంలో రిపీట్ అయిందని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
చంద్రబాబు నాయుడు అమరావతిని ఐటీ విషయంలో ఊహించని స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. చంద్రబాబు నాయుడు అమలు చేస్తున్న అన్న క్యాంటీన్ పథకంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు నాయుడు ఇతర రాష్ట్రాల నేతలకు సైతం స్పూర్తిగా నిలుస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. చంద్రబాబు నాయుడు వయస్సు పెరుగుతున్నా తన ఎనర్జీ లెవెల్స్ తో ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం. చంద్రబాబు నాయుడు అనుభవం అమరావతికి ఎంతో మేలు చేయడం పక్కా అని కామెంట్లు వినిపిస్తున్నాయి. నెటిజన్లు చంద్రబాబు నాయుడును ఈ విషయంలో ఎంతగానో మెచ్చుకుంటున్నారు.