ఏపీ: వాలంటీర్లకు ఆ అవకాశం కూడా ఎత్తేసిన ప్రభుత్వం.!

FARMANULLA SHAIK
ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడే వాలంటీర్లకు మ్యాటర్ అర్థమైపోయింది. తమకు ఇక ఈ వ్యవస్థలో ఫ్యూచర్ లేదని వారికి తెలిసిపోయింది. అయినా సరే ప్రభుత్వంపై ఎక్కడో ఉన్న చిన్న ఆశతో ఇన్నాళ్లూ ఎదురుచూస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఓ మంత్రి చేసిన ప్రకటనతో పిక్చర్ స్పష్టంగా అర్థమైపోయింది. ఇక వాలంటీర్లకు కూటమి ప్రభుత్వంలో ఫ్యూచర్ లేనట్లే. వారు వేరే కెరీర్ ఎంచుకోవడం బెటర్ అనే మీనింగ్ వచ్చేసింది. అసలు ఆంధ్రప్రదేశ్ వాలంటీర్లకు ఇది మామూలు షాక్ కాదు. అతి భారీ షాక్. అసలు వాళ్లు ఇలాంటి వార్త వింటామని కలలో కూడా అనుకొని ఉండరు.అదేమిటంటే గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లు రోజూవారికి కేటాయించిన యాప్‌లో హాజరు వేసుకుంటున్నారు. ఈ హాజరును గత వారం ప్రభుత్వం నిలిపివేసింది. దాంతో.. ఈ వ్యవస్థ అమలులో లేదని మరోసారి రుజువైంది.వాలంటీర్ వ్యవస్థను వైసీపీ ప్రభుత్వమే రద్దు చేసిందని ఇటీవల ఏపీ శాసనమండలిలో మంత్రి బాలవీరాంజనేయస్వామి తెలిపారు.

వాలంటీర్ వ్యవస్థే లేదన్న మంత్రి మరి వాలంటీర్ల యాప్‌ని ఎందుకు కొనసాగించడం? ఎందుకు రోజూ వారు అటెండెన్స్ వెయ్యడం? ఇదంతా టైమ్ వేస్ట్ కదా. ఈ వ్యవస్థ లేదని జూన్‌లో అధికారంలోకి వచ్చినప్పుడే చెప్పి ఉంటే, వాలంటీర్లు వేరే దారి చూసుకునేవారు కదా. వారికి లేనిపోని ఆశలు ఎందుకు కల్పించడం, వారి స్కిల్ డెవలప్ చేస్తామని ఎందుకు అనడం? స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్  రెండు మూడు సార్లు వాలంటీర్లకు మెరిగైన కెరీర్ ఇస్తామన్నారు. ఇతర శాఖల్లో వారి సేవల్ని వినియోగించుకోవడంపై ఆలోచిస్తున్నామన్నారు. అసలు మనుగడలో లేని వ్యవస్థ పట్ల ఇలాంటి ప్రకటనలు ఎందుకు చెయ్యడం? ఇలా మంత్రి వీరాంజనేయస్వామి ప్రకటన చేసేవరకూప్ర భుత్వంలో ఇతర మంత్రులకూ, అధికారులకు కూడా ఈ వ్యవస్థ రద్దైందని తెలియకపోవడం చిత్రమే.ఇక ఇప్పుడు వాలంటీర్లు ఇంకా ప్రభుత్వంపై ఆశలు పెట్టుకోవడం వేస్ట్.దీనిపై ఇన్నాళ్లూ వైసీపీ మౌనంగా ఉంటూ రావడం ఆశ్చర్యకరమే. మొత్తంగా వైసీపీ చేసిన పెద్ద తప్పు వల్లే కూటమి ప్రభుత్వం వాలంటీర్లకు జీతాలు ఇవ్వట్లేదని స్పష్టమైంది. ఇక ఇప్పుడు వాలంటీర్లు వేరే కెరీర్, వేరే వేరే ఉద్యోగాలు ఎంచుకోక తప్పని పరిస్థితి వచ్చేసిందనే టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: