చంద్రబాబుకు కూడా వాస్తు పిచ్చి .. అందుకే ఒకే రంగు దుస్తులు ధరిస్తున్నాడా?
అయితే... అలాంటి చంద్రబాబు నాయుడు నిత్యం ఒకే రంగు బట్టలు వేస్తారన్న సంగతి తెలిసిందే. పసుపు రంగు దుస్తులను మాత్రమే చంద్రబాబు ధరిస్తారు. అయితే దీని వెనుక రహస్యం ఉందట. పసుపు రంగు అనేది హిందువులకు శుభసూచికం అని మనం భావిస్తాం. పసుపు కలర్ అనగానే పాజిటివ్ మైండ్ వస్తుంది. మన ఇండ్లలో కడప లకు కూడా... పసుపు రంగే పూస్తారు. హిందూ దేవతల వద్ద కూడా... కచ్చితంగా పసుపు వర్ణం ఉంటుంది.
అలాగే పసుపు బట్టలు వేస్తే... ఎంతమందిలో ఉన్న అదొక స్పెషల్ అట్రాక్షన్ గా మారుతుంది. చాలామంది రాజకీయ నాయకులు వైట్ డ్రెస్ మాత్రమే వేస్తారు. కానీ ఎల్లో డ్రెస్ వేసే చంద్రబాబు నాయుడు చాలా స్పెషల్ గా మారిపోతారు. ఆయన 100 మందిలో ఉన్న గుర్తుపట్టవచ్చు. దానికి తోడు తెలుగుదేశం పార్టీ రంగు కూడా పసుపు రంగు. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని... పసుపు రంగు దుస్తులు మాత్రమే నారా చంద్రబాబు నాయుడు ధరిస్తారట. అయితే ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది.