ఇతనేరా "లీడర్"..సీఎం పాత్రలో అదరగొట్టిన రానా?

Veldandi Saikiran
* రానా - శేఖర్ కమ్ముల కాంబోలో లీడర్
* లీడర్ సినిమాలో ముఖ్యమంత్రిగా రానా

టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది హీరోలు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది చాలా సక్సెస్ అవుతుంటే మరి కొంతమంది అట్టర్ ప్లాప్ అవుతున్నారు. కొంతమంది వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అలాంటి వారిలో హీరో రాణా ఒకరు. హీరో రానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన కెరీర్ లో చాలా సినిమాలు చేసి సక్సెస్ అందుకున్నాడు. అయితే తన.. కెరీర్ ప్రారంభంలోనే లీడర్ సినిమాతో బంపర్ విజయాన్ని అందుకున్నాడు.
ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో రానా నటించి.. అదరగొట్టాడు. ఈ సినిమాలో ముఖ్యమంత్రి పాత్రలో సుమన్ ఉంటే అతడు హత్యకు గురవుతాడు. దీంతో సుమన్ తనయుడిగా ఉన్న రానా...  అమెరికా నుంచి వచ్చి ముఖ్యమంత్రి పాత్రలో.. లీడర్షిప్ కొనసాగిస్తాడు.  ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రానా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు? దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది సినిమా స్టోరీ.
ఈ సినిమాకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించగా... రానా సరసన ఇద్దరు హీరోయిన్లు కనిపించారు. ఒకరు ప్రియా ఆనంద్ అయితే మరొకరు రీచా గంగోపాధ్యాయ. ఈ సినిమా... 2010 సంవత్సరంలో రిలీజ్ అయ్యి బంపర్ హిట్ అందుకుంది. అయితే తన కెరీర్ ప్రారంభంలో ముఖ్యమంత్రి పాత్రలో కనిపించి.. యూత్ ను బాగా ఆకట్టుకున్నాడు రానా దగ్గుబాటి.
 ముఖ్యమంత్రి పాత్రలో కనిపించిన రానా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటాడు. ఇది ప్రతిపక్ష నాయకులతో పాటు సపక్షంలో ఉన్న నేతలకు ఇబ్బందులు కలిగిస్తుంది. దీంతో రానా పై హత్యాయత్నానికి కూడా పాల్పడతారు కొంతమంది రాజకీయ నాయకులు. అయితే వాటిని చాలా చాకచక్యంగా  ఎదుర్కొని...సక్సెస్ అవుతాడు రానా. ఇక ఈ సినిమా మొత్తం నిజమైన రాజకీయాలను తలపించేలా శేఖర్ కమ్ములకు కూడా అద్భుతంగా కథను తెరకెక్కించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: