ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి 2022 నవంబరు 28న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ప్రాథమిక రాతపరీక్ష నిర్వహించినా దేహదారుఢ్య, శారీరక సామర్థ్య పీఎంటీ, పీఈటీ పరీక్షలు జరపలేదు. 2023 మార్చిలో నిర్వహిస్తామని షెడ్యూల్ ఇవ్వడంతోపాటు హాల్‌టికెట్లు జారీ చేశాక పట్టభద్రుల ఎన్నికల పేరుతో వాయిదా వేశారు. ఎన్నికల తర్వాత కూడా ఈ ప్రక్రియ నిర్వహించలేదు. అయితే ఇప్పటి వరకూ దీనికి సంబంధించిన షెడ్యూల్ రాకపోవడంతో ఈ పరీక్షలు నిర్వహిస్తారో లేదో తెలియక అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. నోటిఫికేషన్ జారీ కంటే రెండేళ్ల ముందు నుంచే అభ్యర్థులు ఈ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యం లో తాజాగా పోలీసు రిక్రూట్‌మెంట్ బోర్డు ఛైర్మన్ చేసిన ప్రకటన కానిస్టేబుల్ అభ్యర్ధుల కు ఊరట కలిగించినట్లైంది.ఫిజికల్ టెస్టులకు సంబంధించి స్టేజ్ 2 కోసం దరఖాస్తుల స్వీకరణ గడువును డిసెంబర్ 6వ తేదీ వరకు పొడిగించినట్లు ప్రకటన చేసింది పోలీసు నియామక మండలి.గతంలో విధించిన గడువు నిన్నటి తో ముగిసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ గడువును డిసెంబర్ 6వ తేదీ కి పొడిగించారు. ఎక్కువమందికి లబ్ధి చేకూరాలని నిర్ణయం తీసుకున్నారు. డిసెంబర్ చివరి వారంలో పిఈటి, పిఎమ్టి టెస్టులు నిర్వహించనున్నారు. అభ్యర్థులకు ఏదైనా సమస్యలు ఉంటే.. 9441450639, 9100203323 నెంబర్లకు..ఫోన్ చేయాలని ప్రకటన చేసింది పోలీస్ నియామక మండలి. ఏపీ పోలీస్ వెబ్సైట్ ద్వారా పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాలని వివరించింది.ఈ నేపథ్యంలో ఈ వివరాలను ఒక్కసారి మాత్రమే సవరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అప్లికేషన్‌లో మొబైల్ నంబర్, ఈ-మెయిల్ అడ్రస్, చిరునామా, ఎమర్జెన్సీ కాంటాక్ట్ డిటైల్స్, అభ్యర్థి ఫొటోలో తప్ప మిగిలిన విషయాల్లో మాత్రమే మార్పులకు అవకాశం కల్పిస్తారు.గతంలో దేహదారుఢ్య పరీక్షలకు దరఖాస్తు చేసుకోని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగ పరచుకోవాలని అభ్యర్ధులకు సూచించారు.