పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే ఏపీ సర్కార్ పథకాలు.. వైరల్ వార్తల్లో అసలు ట్విస్ట్ ఇదే!

Reddy P Rajasekhar
ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల్లో ఏవి నిజమో ఏవి అబద్ధమో తెలుసుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఏ చిన్న తప్పు చేసినా సంక్షేమ పథకాలకు అర్హత పొందలేమో అని చాలామంది భయాందోళనకు గురవుతున్నారు. పోస్టాఫీస్ అకౌంట్ ఉంటేనే ఏపీ సర్కార్ పథకాలు పొందే అవకాశం ఉంటుందంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది.
 
ఈ వార్తను గుడ్డిగా నమ్మి కొంతమంది పోస్టాఫీస్ అకౌంట్ ఓపెన్ చేయడానికి పోస్టాఫీస్ లకు క్యూ కడుతున్నారు. ఏపీలో కొందరి దుష్ప్రచారంతో మహిళలు పోస్టాఫీస్ ల చుట్టూ క్యూ కడుతున్నారు. పోస్టాఫీస్ లలో ఇపటికే అకౌంట్ ఉన్నవాళ్లు ఎన్పీసీఐతో లింక్ చేసుకోవాలని ప్రచారం సాగుతుండటం కొసమెరుపు. ఇప్పటికే బ్యాంకుల్లో అకౌంట్లు ఉన్నవాళ్లు సైతం పోస్టాఫీసుల వైపు పరుగులు పెడుతున్నారు.
 
వైరల్ అవుతున్న వార్తల్లో నిజం లేదని అధికారులు చెబుతున్నా ప్రజలు మాత్రం నమ్మడం లేదు. ఒరిజినల్ వార్తల కంటే ఫేక్ వార్తలనే ప్రజలు ఎక్కువగా నమ్ముతుండటం కొసమెరుపు. వైరల్ వార్తలకు సంబంధించి క్లారిటీ రావడంతో ఇకనైనా ప్రజలు పోస్టాఫీస్ ఖాతాలను ఓపెన్ చేయడం ఆపేస్తారేమో చూడాల్సి ఉంది. పోస్టాఫీస్ స్కీమ్స్ వల్ల దీర్ఘకాలంలో ఎంతో బెనిఫిట్ కలుగుతుంది.
 
కొన్ని పోస్టాఫీస్ స్కీమ్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల దీర్ఘకాలంలో భారీగా లాభాలు సొంతమవుతాయి. ఒక్కో స్కీమ్ ఒక్కో విధంగా బెనిఫిట్స్ అందిస్తున్న నేపథ్యంలో సరైన పథకాలను ఎంచుకోవడం ద్వారా అదిరిపోయే ప్రయోజనాలను పొందవచ్చు. వయస్సును బట్టి పోస్టాఫీస్ పథకాలలో సైతం మార్పులు ఉంటాయని చెప్పవచ్చు. వాస్తవానికి ప్రభుత్వ పథకాలకు సంబంధించి డబ్బు ఖాతాలో డైరెక్ట్ గా జమ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇందుకోసం పోస్టాఫీస్ ఖాతాలతో పోల్చి చూస్తే బ్యాంక్ ఖాతాలనే ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది. ప్రజలు దుష్రచారం చేస్తున్న వాళ్లపై ఫిర్యాదు చేస్తే మంచిది.




మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: