ప్రతి బుధ, గురువారాలు కార్యకర్తలతో నిద్ర..జగన్‌ సంచలన నిర్ణయం !

Veldandi Saikiran
ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. సంక్రాంతి తర్వాత జనంలోకి జగన్ రాబోతున్నాడు. ప్రతి బుధ, గురువారం జిల్లాలోనే బస చేయనున్నారు. ‘కార్యకర్తలతో జగనన్న.. పార్టీ బలోపేతానికి దిశా నిర్దేశం’ పేరుతో కార్యక్రమానికి జగన్ శ్రీకారం చుట్టారు. గత 5 ఏళ్లలో చేసిన తప్పిదాలను ఇకపై చేయకుండా.. కార్యకర్తలకు దగ్గర కాబోతున్నారు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి.

తాజాగా తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి కృష్ణా జిల్లా నేతలతో జగన్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ...సంక్రాంతి తర్వాత జనంలోకి వస్తున్నట్లు ప్రకటించారు. చంద్రబాబు కూటమి సర్కార్‌ తప్పిదాలను జనాల్లోకి తీసుకెళ్లేందుకు డిసైడ్‌ అయినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్‌ బుడ్‌ రాజ్యాంగం నడుస్తోందని.. వ్యవస్ధలన్నీ కూప్పకూలిపోయిన పరిస్దితి కనిపిస్తోందని జగన్‌ పేర్కొన్నారు.
దొంగకేసులు పెడుతున్నారని... ప్రభుత్వాన్ని ఎవరైనా విమర్శిస్తూ పోస్టింగులు పెట్టినా, ఫార్వార్డ్‌ చేసినా కూడా కేసులు పెడుతున్నారన్నారు.  ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారని... మన ప్రభుత్వానికి, చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజలు పోల్చి చూస్తున్నారని ఆగ్రహించారు. కూటమి ప్రభుత్వంపై ప్రతి ఇంట్లోనూ చర్చ నడుస్తుందని... జగన్‌ కుటుంబమంతటికీ మేలు చేశాడన్నారు.  చంద్రబాబు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికీ మేలు చేస్తానన్న  ప్రలోభాలకు మొగ్గు చూపిన పరిస్థితులు చూశామని స్పష్టం చేశారు.

సాధ్యం కాని హామీలిచ్చారని... మనకు అబద్దాలు చెప్పడం చేతగాదని తేల్చి చెప్పారు. మన పాలనలో చక్కగా బటన్లు నొక్కామని.. కాబట్టి చంద్రబాబు కూడా చేస్తాడేమోనని ప్రజలు ఆశపడ్డారని వెల్లడించారు. కానీ ఆరునెలలు తిరక్కమునుపే వాస్తవం అర్ధమయిందని... ప్రతి ఇంట్లో దీనిపై చర్చ జరుగుతోందన్నారు జగన్‌. ప్రతి వ్యవస్ధ కుప్పకూలిపోతుందని... ఫీజులు ఇవ్వక పిల్లలు కాలేజీలకు వెళ్లలేని దుస్థితి ఉందని ఫైర్ అయ్యారు. గతంలో వైసీపీకి 151 స్థానాలు వచ్చాయని... వచ్చే ఎన్నికల్లో టీడీపీకి సింగిల్ డిజిట్ కి పరిమితం చేయాలని పిలుపునిచ్చారు. అబద్ధం, మోసాలు చేస్తూ మంచి చేయని వారిపై ప్రజలకు కోపం వస్తుందన్నారు జగన్‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: