ఏపీ: జగన్ లో మార్పు వైసీపీకి ఊపు ఇస్తోందా..?
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను వెంటాడి, వేటాడుతున్నటువంటి వేళ తన కార్యకర్తలకు భరోసా ఇవ్వడం వంటిది మాజీ సీఎం జగన్ ముందు ఉన్నటువంటి ప్రధాన కర్తవ్యం.. అదే పనిని ఇప్పుడు చేసుకొస్తూ ఉన్నారు జగన్. తను మాట్లాడుతున్నటువంటి తీరు , చాలా స్పాంటేనియస్ గా చాలా స్పష్టంగానే అందరికీ ఊపు తీసుకువచ్చేలా చేస్తోంది. గతంలో కార్యకర్తలని పట్టించుకోలేదని వాదన వైసీపీ పార్టీకి కేవలం వాలంటరీలతోనే ఎక్కువగా ఉపయోగించారని వాదన వినిపిస్తూ ఉండేది. కానీ 2024 ఎన్నికలలో భాగంగా అప్పటినుంచి కార్యకర్తల మీద ఎక్కడ వేటుపడిన అక్కడ ప్రత్యక్షమవుతూ ఉన్నారు జగన్.
ముఖ్యంగా వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తల మీద కేసులు పెట్టడం.. ప్రభుత్వాన్ని ఎవరైనా సరే విమర్శిస్తూ పోస్టులు చేసిన.. ఫార్వర్డ్ చేసిన కూడా కేసులు పెట్టే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు తీసుకువచ్చారని తెలిపారు.. అంతేకాకుండా ఒకవైపు మంచి చేయకుండానే.. మరొకవైపు ప్రశ్నించే గొంతుని సైతం అణిచివేయాలని విశ్వరూపాన్ని చూపిస్తున్నారు చంద్రబాబు అంటూ ఫైర్ అయ్యారు. సాధారణంగా ఆరు నెలల వ్యవధిలో ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉండాలనుకుంటే కానీ అంతకుమించిపోయి మరి వ్యతిరేకత ఏర్పడింది కూటమి ప్రభుత్వం మీద అంటూ తెలియజేశారు. క్యారెక్టర్ , క్రెడిబిలిటీ విశ్వనీయత అనేది ఒకసారి పడిపోయింది అంటే.. మళ్లీ ఏరుకోవడం కష్టమే అంటూ తెలిపారు. ఏరోజైనా సరే ఎల్లకాలం కష్టాలు ఉండవు రాత్రి అన్నాక పగలు రావాల్సిందే అంటూ తెలిపారు.. అయితే ఇప్పుడు మాట్లాడుతున్న తీరు వైసిపి నేతలను కార్యకర్తలను అటు ప్రజలను కూడా మమేకమయ్యాల చేస్తున్నదట.