బొద్దింకల్ని పెంచుతారు.. అక్కడ అదే పెద్ద వ్యాపారం.. ఎక్కడంటే?

praveen
మనలో చాలామందికి బొద్దింకను చూస్తేనే అనేక రకాల ఇబ్బందులు అలాగే వాంతులు కూడా వస్తాయి. కానీ, అదే చైనాలో అయితే బొద్దింకల్ని ప్రత్యేకంగా పెంచే ఫారాలు కూడా ఉన్నాయని మీకు తెలుసా.? అందులో ఎక్కువగా పెరిప్లానెటా అమెరికానా జాతి వాటినే వారు పెంచుకుంటారు అని సమాచారం. వాటికీ వారు సంప్రదాయ వైద్యంలో, సౌందర్య ఉత్పత్తుల్లో వాడుతుండటమే ఆ పెంపకం వెనుక ఉన్న ముఖ్య కారణం అని చెప్పాలి. బొద్దింకల నుంచి తయారుచేసిన ఔషధాలు క్యాన్సర్, అల్సర్, ఆస్తమా, గుండె వ్యాధులకు బాగా ఉపయోగపడుతాయని అక్కడి వారి నమ్మకం కూడా.
అలాగే, చైనాలో బొద్దింకలను ఉత్పత్తి చేసి అమ్మేవారు కూడా ఉన్నారు. అవును, మీరు విన్నది నిజమే. ఆ ప్రాంతంలో బొద్దింకలే బంగారం. ప్రపంచ మార్కెట్‌లో బొద్దింకలు బంగారంతో సమానంగా ఖరీదైనవిగా అక్కడి వారి నమ్మకం. ఈ తరుణంలో బొద్దింకలు సాధారణంగా  అన్ని కాలాల్లోనూ కూడా జీవించగలవు. అందుకే ఆ జాతి 5 మిలియన్ సంవత్సరాలకు పైగా జీవిస్తుందని శాస్త్రవేత్తలు తెలియచేస్తూ ఉంటారు. వాస్తవానికి మన దేశీయులు వీటిని చాలా అసహించుకుంటారు. కానీ., ఇతర దేశాల్లో బొద్దింకలను ఆహారంగా  కూడా ఉపయోగిస్తారు. అక్కడ బొద్దింకలకు ఆహారం కోసం డిమాండ్ కూడా ఉండడం విశేషం. ఈ బొద్దింకలను అనేక దేశాలలో సాగు చేస్తుంటారు. అందులో చైనా ఒకటి అన్న మాటలో ఎటువంటి సందేహం లేదు.
అలాగే ఆఫ్రికాలో చాలా మంది బొద్దింకలను ఆహారంగా తింటారు. ప్రపంచ బ్యాంకు ప్రకారం.. ఆఫ్రికా ఖండంలో ఆకలి, పేదరికం, పర్యావరణ సంక్షోభాలకు పురుగుల పెంపకం ఒక పరిష్కారం. అలాగే గొప్ప పోషక లక్షణాలను కూడా కలిగి ఉంటాయి అని తెలుస్తోంది. దీనికి ఫలితంగా ఆఫ్రికాలోని పోషకాహార లోపంతో బాధపడుతున్న 20 శాతం మంది ప్రజలు ఎంతో ప్రయోజనంగా వీటిని వాడుతారట. అలాగే ఆఫ్రికాలోని పందులు, మేకలు, చేపలు ఇంకా పౌల్ట్రీల మొత్తం ముడి ప్రోటీన్ అవసరాలలో 14 శాతం బొద్దింకల పెంపకం ద్వారా తీర్చవచ్చని అక్కడి వారు తెలియచేస్తున్నారు. ఇక్కడ మరొక ఆశక్తికర విషయం ఏమిటంటే..  ప్రస్తుతం 2100 రకాల కీటకాలు ప్రపంచంలో తినదగినవి అని గుర్తించారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: