బీజేపీకి షాక్‌...షిండే వర్గం సంచలన నిర్ణయం..ఒక్క పదవి వద్దట!

Veldandi Saikiran

మహారాష్ట్రలో రాజకీయాలు రోజురోజుకు వేడెక్కుతున్నాయి. అధికారంలోకి బిజెపి కూటమి వచ్చినప్పటికీ... ముఖ్యమంత్రి ఎవరు అనేదానిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఏకనాథ్ షిండే ను మరోసారి సీఎం చేయాలని చాలా మంది డిమాండ్ చేస్తున్నారు. అయితే అత్యధిక సీట్లు గెలిచిన బిజెపి పార్టీకి.. ఈసారి ముఖ్యమంత్రి పదవి రావాలని మరి కొంతమంది అంటున్నారు. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం ఎవరు ఎక్కుతారు ? అనేదానిపైనా సందిగ్ధత నెలకొంది.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో... బిజెపి కూటమి అఖండ విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. మొన్నటి ఎన్నికల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ కూటమికి ప్రతిపక్ష హోదా కూడా రాకుండా చేసింది ఎన్డీఏ కూటమి. ఇందులో 132 అసెంబ్లీ స్థానాలు దక్కించుకున్న భారతీయ జనతా పార్టీ సింగల్  లార్జెస్ట్ పార్టీగా మహారాష్ట్రలో ఎదిగింది. అయితే.. ఎక్కువ సీట్లు వచ్చిన నేపథ్యంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా... భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వాలని అందరూ అంటున్నారు.

ఇక దీన్ని ఏక్ నాథ్ షిండే కు సంబంధించిన శివసేన పార్టీ వ్యతిరేకిస్తోంది. కానీ అజిత్ పవర్ వర్గం మాత్రం...  మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఉంటే బాగుంటుందని చెబుతోంది. బిజెపి కూటమిలో శివసేన, ఎన్సిపి, బిజెపి ఉన్న సంగతి తెలిసిందే.  కానీ మహారాష్ట్రలో చక్రం తిప్పాలంటే  కచ్చితంగా ఏక్ నాథ్ షిండే కు చెందిన  శివసేన సపోర్ట్ కచ్చితంగా అవసరం. కాబట్టి బిజెపి కూడా కాస్త తలోగ్గి నడుస్తోంది.

అయితే ఇలాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వమే ఏర్పాటు అయితే... ఒక్క పదవి కూడా తీసుకునేది లేదని ఏక్ నాథ్ షిండే వర్గం నిర్ణయం తీసుకుందని వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి ఇస్తే తప్ప ఏ పదవి తీసుకోకూడదని... ఏక్ నాథ్ షిండే వర్గం నిర్ణయం తీసుకుందట. ఇప్పుడు ఇదే మహారాష్ట్రలో జోరుగా చర్చ జరుగుతోంది. కాగా డిసెంబర్ రెండవ తేదీన మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవి ప్రమాణస్వీకారం ఉంటుంది. మరి ఎవరూ ఈ పీఠాన్ని దక్కించుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP

సంబంధిత వార్తలు: