బీజేపీకి షాక్...మహారాష్ట్ర ప్రతిపక్ష నేతగా షిండే ?
288 స్థానాలలో... బిజెపి కూటమి ఈ ఏకంగా 234 కు పైగా స్థానాలను దక్కించుకోవడం విశేషం. అంటే కాంగ్రెస్ కూటమికి ప్రతిపక్ష హోదా కూడా రాలేదన్న మాట. ఇక ఇందులో బిజెపి పార్టీకి 132 స్థానాలు వచ్చాయి. దీంతో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా భారతీయ జనతా పార్టీ చరిత్ర సృష్టించింది. మరో 13 స్థానాలు కైవసం చేసుకుంటే.. సింగిల్ గా మహారాష్ట్రలో అధికారాన్ని చేపట్టేది. ఇప్పటికీ కూడా ఏక్ నాథ్ షిండే ను... వదిలేసి అజిత్ పవర్ వర్గంతో కలిసి వెళ్లే ఛాన్స్ బిజెపికి ఉంది.
కానీ భారతీయ జనతా పార్టీ అలా చేయడం లేదు. ఏక్ నాథ్ షిండే ను కలుపుకొని ముందుకు వెళ్తోంది. కానీ తనకు ముఖ్యమంత్రి పదవి ఖచ్చితంగా కావాలని పట్టు పట్టారట ఏక్ నాథ్ షిండే. కానీ బిజెపి నేతలు మాత్రం దీనికి అస్సలు ఒప్పుకోవడం లేదట. ఎక్కువ సీట్లు గెలుచుకున్న తమకే ముఖ్యమంత్రి పదవి రావాలని అంటున్నారట బీజేపీ నేతలు. అయితే... ముఖ్యమంత్రి పదవి లేకపోతే కూటమిలో ఎలాంటి పదవులు తీసుకోకూడదని నిర్ణయం తీసుకున్నారట ఏక్ నాథ్ షిండే.
ఎలాగో మహారాష్ట్రలో ప్రతిపక్ష పార్టీలకు తక్కువ స్థానాలు వచ్చిన నేపథ్యంలో.. ఏ పదవులు తీసుకోకుండా ప్రతిపక్ష హోదాలో కూర్చోవాలని ఏక్ నాథ్ షిండే నిర్ణయం తీసుకున్నారట. కాంగ్రెస్ కూటమి ఇటు బిజెపి కూటమికి దూరంగా ఉండాలని... అనుకుంటున్నారట ఏక్ నాథ్ షిండే. అయితే ఏక్ నాథ్ షిండే తీసుకున్న ఈ నిర్ణయం నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ నేతలు... అసంతృప్తిగా ఉన్నారట. దీంతో ఏక్ నాథ్ షిండే ను బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారట. కాగా మొన్నటి ఎన్నికల్లో... 57 స్థానాలు గెలుచుకున్నారు ఏక్ నాథ్ షిండే.