రూ.లక్షల కోట్లు ఉన్న అదానీ.. మొదటి సంపాదన అంత తక్కువా?

praveen
గౌతమ్ అదానీ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన అదానీ గ్రూప్ అనే పెద్ద కంపెనీని స్థాపించి నడిపిస్తున్నారు. ఈ గ్రూప్ కింద ఎన్నో కంపెనీలు ఉన్నాయి. అదానీ భారతదేశంలోనే అత్యంత ధనికుడిగా రాణిస్తున్నారు. 2024 హురున్ రిచ్ లిస్ట్ ప్రకారం, ఆయన కుటుంబం దగ్గర సుమారు 11 లక్షల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి. కానీ, ఆయనకు 2023 సంవత్సరంలో ఆయనకు ఒక పెద్ద నష్టం జరిగింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ సంస్థ, అదానీ గ్రూప్ గురించి కొన్ని విషయాలు బయటపెట్టింది. దీంతో అదానీ గ్రూప్ షేర్ల ధర చాలా తగ్గిపోయింది. ఫలితంగా, ఆయన దగ్గర ఉన్న డబ్బులో సుమారు సగం డబ్బులు పోయాయి. తరువాత ఆయన దగ్గర ఉన్న డబ్బు 4.74 లక్షల కోట్ల రూపాయలకు తగ్గిపోయింది. మళ్లీ ఆయన తెలివితో, నమ్మకంతో తన ఆస్తులను తిరిగి పెంచుకున్నారు.
గౌతమ్ అదానీ గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జన్మించారు. ఆయన అక్కడే చదువుకున్నారు. కానీ, కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసి, వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నారు. అప్పటి నుండి ఆయన ఎన్నో కష్టాలు పడి, చివరకు ఇంత పెద్ద వ్యాపారవేత్త అయ్యారు. 1978లో గౌతమ్ అదానీకి కేవలం 16 ఏళ్ల వయసు ఉన్నప్పుడు, ఎన్నో కలలతో ముంబై వెళ్లారు. అక్కడ మహేంద్ర బ్రదర్స్ అనే కంపెనీలో డైమండ్ సార్టర్‌గా పనిచేయడం ప్రారంభించారు. అంటే, వజ్రాలను వాటి బరువు, రంగు, స్వచ్ఛత ఆధారంగా వేరు చేసే పని చేశారు. ఈ ఉద్యోగం ద్వారా ఆయనకు చాలా అనుభవం వచ్చింది. ఆపై ముంబైలోని జవేరీ బజార్‌లో తన సొంత వజ్రాల వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆయన తొలి రోజుల్లో చాలా కష్టపడ్డారు.
గౌతమ్ అదానీ తన జీవితంలో సంపాదించిన మొట్టమొదటి శాలరీ గురించి ఎప్పుడూ గర్వంగా చెప్పుకుంటారు. ఒకసారి జైపూర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన తన జీవితంలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటన గురించి చెప్పారు. 1978లో మహేంద్ర బ్రదర్స్‌లో పని చేస్తున్నప్పుడు, ఆయన ఒక జపాన్ వ్యాపారితో ఒప్పందం చేసుకున్నారు. ఆ ఒప్పందం ద్వారా ఆయన రూ.10,000 సంపాదించారు. తన జీవితంలో అదే తాను సంపాదించిన మొట్టమొదటి శాలరీ అని, అది ఎప్పటికీ మరచిపోలేని క్షణం అని ఆయన చెప్పారు. అప్పటి నుండి, అదానీ చాలా కష్టపడి పనిచేశారు. ఆయనకు ఉన్న దూరదృష్టితో 1988లో అదానీ గ్రూప్‌ను స్థాపించారు. ఈ రోజు అది భారతదేశంలో అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యాలలో ఒకటిగా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: