ఏపీ పింఛన్: షాక్ ఇచ్చిన ప్రభుత్వం.. లెక్కలు చూపిస్తున్న వైసిపి..!
అయితే కొత్త పెన్షన్ల కోసం చాలామంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్న సమయంలో ప్రతినెల పెన్షన్ తీసుకునే వారి సంఖ్య తగ్గిస్తూ వస్తున్నట్లు కనిపిస్తోందట కూటమి ప్రభుత్వం.. ఈ విషయాన్ని వైసిపి ప్రభుత్వం తమ సోషల్ మీడియా వేదికగా లెక్కలతో సహా మరి చూపించింది. పెన్షన్ల విషయంలో ప్రతినెల సంఖ్య తగ్గుతూనే ఉందని జగన్ ప్రభుత్వంలో మే నెలలో..65,49,864 మంది తీసుకుంటూ ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత..64,14,174 మంది పెన్షన్ ని అందిస్తున్నారట. అయితే డిసెంబర్ కి వచ్చేసరికి ఆ సంఖ్య మరింత..63,92,702 కి తగ్గిపోయిందట.
సుమారుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మూడు లక్షల వరకు అర్హత లేని పెన్షన్ వారు ఉన్నారంటు కూటమి ప్రభుత్వం అయితే తెలియజేస్తోంది.. వెయ్యి రూపాయలు పెంచుతారని ఆనందపడే లోపు పెన్షనర్లకు లక్ష సంఖ్యలో పెన్షన్లను తొలగించడంతో చాలామంది భయభ్రాంతులకు గురవుతున్నారు.. పెన్షన్ల విషయంలో వైసిపి ప్రశ్నిస్తే తమ హయాంలోని ఇష్టం వచ్చినట్లు పెన్షన్లు ఇచ్చారని సాకు చూపిస్తోందట కూటమి ప్రభుత్వం. ప్రస్తుతం ఉన్న సమయంలో కొత్త పెన్షన్లకు మంజూరు కోసం చాలామంది లబ్ధిదారులు ఎదురుచూస్తున్నారు.. మరి పెన్షన్ల విషయంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ఈ పనులకు చాలామంది కార్యకర్తల పైన కూడా నియోజకవర్గాలలో విమర్శలు వినిపిస్తూ ఉన్నాయట.. మరి ఈ విషయం ని కూటమి ప్రభుత్వం గ్రహించి సరైన నిర్ణయాన్ని తీసుకుంటుందేమో చూడాలి.