విజయవాడ - విశాఖప‌ట్నం మెట్రో రైల్ ప్లానింగ్ ఇదే...!

RAMAKRISHNA S.S.
ఆంధ్రప్రదేశ్లో రెండు కీలక నగరాల మెట్రో రైల్ తొలిదశ డిపిఆర్ ల‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. విశాఖపట్నం - విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన తొలిదశ డిపిఆర్ ల‌ను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. విశాఖపట్నంలో తొలి దశలో 46.3 కిలోమీటర్ల మేర మూడు కారిడార్లు నిర్మించాలని నిర్ణయించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు దాదాపు 34.4 కిలోమీటర్ల మేర.. ఒకటో కారిడార్ గురుద్వార్ నుంచి పాత పోస్ట్ ఆఫీస్ వరకు ఐదు కిలోమీటర్ల మేర... రెండో కారిడార్ తాడిచెట్లపాలెం నుంచి చినవాల్తేరు వరకు 6.75 కిలోమీటర్ల మేర మూడో కారిడార్ నిర్మాణం చేపట్టనుంది. తొలి దశలో మొత్తంగా రు. 11498 కోట్ల వ్య‌యం అవుతుందని అంచనా వేస్తున్నారు. విశాఖ మెట్రో రైల్ ప్రాజెక్టు.. రెండో దశలో కొమ్మాది నుంచి భోగాపురం విమానాశ్రయం వరకు 30 కిలోమీటర్ల మేర నాలుగో కారిడార్‌ను నిర్మించాలని ప్రభుత్వం భావిస్తుంది.

ఇక విజయవాడ మెట్రో రైల్ డీ పీ ఆర్ కు సైతం రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీన్ని రెండు దశల్లో మొత్తంగా 38.4 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టాలని భావిస్తుంది. దీనికి సంబంధించిన డిపిఆర్ ను మెట్రో రైల్ కార్పొరేషన్ రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించగా ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టును మొత్తంగా రు. 11009 కోట్ల మేర ఖర్చుపెట్టి నిర్మిస్తారు. భూసేకరణ కోసం రు. 1152 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించేలా డిపిఆర్ సిద్ధం చేశారు. విజయవాడ మెట్రోలో రెండో దశలో భాగంగా మూడో కారిడార్ను దాదాపు 27.75 కిలోమీటర్ల మేర‌ నిర్మిస్తారు.

తొలి కారిడార్ లో గన్నవరం నుంచి పండిట్ నెహ్రూ బస్టాండ్ వరకు .. అలాగే పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి పెనమలూరు వరకు రెండో కారిడార్‌ను... పండిట్ నెహ్రూ బస్టాండ్ నుంచి అమరావతి వరకు మూడో కారిడార్ను రెండు దశలో నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈ ప్రాజెక్టులను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసింది. ఈ మేరకు విశాఖ - విజయవాడ నగరంలో మెట్రో రైలు ప్రాజెక్టులను డిపిఆర్ ఆమోదిస్తూ పుర‌పాల‌క శాఖ కార్యదర్శి కన్నబాబు ఉత్తర్వులు జారీ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: