ఏపీ: వైసిపి- జనసేన మధ్య డేటా వార్..!
అయితే ఇప్పుడు తాజాగా వైసిపి పార్టీ వాళ్లు ఒక కొత్త అంశాన్ని తీసుకువచ్చారు.. ఉదయం నుంచి పెద్ద ఎత్తున ఇది వైరల్ గా మారుతున్నది.. ఒకరికొకరు ట్రోల్ చేసుకుంటూ ఉన్నారు. ఒక నెటిజన్ వ్యక్తిగత సమాచారాన్ని సైతం జనసేన అభిమాన సోషల్ మీడియాలో షేర్ చేయడం పైన వైసిపి చాలా తీవ్రస్థాయిలో స్పందించడం జరిగింది.. రాష్ట్రంలో పెద్ద ఎత్తున డేటా ఉల్లంఘన జరుగుతోందని సున్నితమైన సమాచారం జనసేన అభిమానుల చేతులలోకి వెళ్ళిందనే విధంగా మాట్లాడుతూ ఇది వేధింపుల కోసమే వాటిని ఉపయోగిస్తున్నారనే విధంగా తెలిపారు..
అలాగే పోలీస్ శాఖ నిర్లక్ష్యంతో ప్రజల భద్రత ప్రమాదంలో పడేసేలా చేశారంటూ పైరయ్యింది వైసిపి.. ఈ ఘటన పైన వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా కేంద్ర మంత్రి అమిత్ షాను కోరుతున్నామంటూ ఒక ట్విట్ చేయడం జరిగింది. వాస్తవానికి ఇలాంటి డేటా లీక్ కాకూడదు బయటికి కూడా రాకూడదు.. అలాంటిది ఒక సాధారణ జనసేన కార్యకర్తకు ఎలా వచ్చింది.. సంథింగ్ ఏదో తేడా జరుగుతోందని విధంగా వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారు. అప్పుడు కూడా వాలంటరీలు ఇలాంటి పనులు చేసి సంఘ వ్యతిరేకలతో చేతులు కలిపారనీ ఆరోపించారు.. ఇప్పుడు అధికారులతో చేతులు కలిపి ఫ్యాన్స్ పంచుకుంటున్నారా లేకపోతే ఫాన్స్ రూపంలో హిట్ మాన్ గ్యాంగులను తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నారా.. అంటూ వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు..ఇదే ఇలాగే కొనసాగితే ప్రజాస్వామ్యం అవుతుందా అంటూ కొన్ని పోస్టులు వైరంగా మారుతున్నాయి. ఈ విషయం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారుతున్నది.