బాబు... ఎన్ని కోట్లు అయినా అప్పులు చెయ్.. మోడీ ఆదేశాలు?

Veldandi Saikiran

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి మోడీ సర్కార్ వరాల వర్షం కురిపిస్తోంది. ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉండడంతో... ఏది అడిగినా మోడీ ప్రభుత్వం కాదనడం లేదు. ముఖ్యంగా అప్పుల విషయంలో ఏపీ ప్రభుత్వానికి... మోడీ ప్రభుత్వం పూర్తిగా సహకారం అందిస్తోంది. ఎఫ్ ఆర్ బి ఎం  పరిధి దాటి మరి  అనుమతులు ఇచ్చేస్తోంది మోడీ ప్రభుత్వం. తాజాగా మరో నాలుగు వేల 123 కోట్లకు  అనుమతి ఇచ్చింది మోడీ సర్కార్.
దీంతో ఆంధ్ర ప్రదేశ్ అప్పులు..  చంద్రబాబు హయాంలో 58 వేలకు చేరినట్లు తెలుస్తోంది.  అయితే ఇందులో దాదాపు 20 కోట్లు  జగన్ ప్రభుత్వంలో చేసినవి ఉన్నాయి. మిగతా 38 కోట్లు... చంద్రబాబు హయాంలో చేసినవే. అంటే నాలుగు నెలల్లోనే 40,000 కోట్లు...  చంద్రబాబు ప్రభుత్వం అప్పులు చేయడం జరిగింది. ఎన్డీఏ కూటమిలో చంద్రబాబు ఉన్న నేపథ్యంలో ఎక్కువ స్థాయిలో అప్పులు తీసుకునేందుకు కూడా మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది.
ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప... ఎక్కువ శాతం అప్పులు తీసుకునేందుకు అవకాశం ఇవ్వరు.  ఎఫ్ ఆర్ బి ఎం పరిగి లోబడి మాత్రమే అప్పులు ఇస్తారు.  కానీ కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి నాలుగు శాతం దాటి మరి అప్పులు తీసుకునేందుకు వెసులుబాటు కల్పించింది మోడీ ప్రభుత్వం.  అప్పుడు అన్ని ప్రభుత్వాలకు ఎఫ్ ఆర్ బి ఎం విషయంలో వెసులుబాటు ఇచ్చింది కేంద్ర సర్కార్.
కరోనా నేపథ్యంలో ఆదాయ వనరులు పడిపోయాయి.అందుకే అలాంటి నిర్ణయం తీసుకుంది మోడీ ప్రభుత్వం.కానీ ఇప్పుడు ఎలాంటి కరోనా పరిస్థితి లేనప్పటికీ..  కేవలం మోడీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు భాగస్వామ్యలుగా ఉన్నారు కాబట్టి...  ఎప్పుడు అడిగినా అప్పులు తీసుకునేందుకు వసూలు బాటు కల్పిస్తోంది మోడీ సర్కార్. ఇందులో భాగంగానే తాజాగా మరో నాలుగు వేల కోట్లు ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: