జగన్ కు ఎదురు దెబ్బ.. జనసేనలోకి ధర్మాన ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం కోల్పోయిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో ఓడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి పార్టీని ఒక్కొక్క లీడర్ వదిలి వెళ్ళిపోతున్నారు.జగన్ అంటే.. పడి చచ్చిపోయే బాలినేని శ్రీనివాస్, ఆళ్ల నాని లాంటి నేతలు కూడా పార్టీని వీడారు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లేందుకు వైసిపి నేతలు సిద్ధంగా ఉన్నారు. అటు ఇప్పటికే ఆర్ కృష్ణయ్య, మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ రావు లాంటి రాజ్యసభ సభ్యులు కూడా... రాజీనామా చేసి జంప్ అయ్యారు.

 అందులో కొంతమంది తెలుగుదేశం పార్టీ తీర్తంపుచ్చుకుంటే... మరి కొంతమంది జనసేన పార్టీ వైపు వెళ్తున్నారు.  ఎక్కడ ఛాన్స్ వస్తే అక్కడికి నేతలు వెళ్ళిపోతున్నారు. ఐదేళ్లపాటు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఐదేళ్ల తర్వాత మళ్లీ... వైసిపి గెలుస్తుందని నమ్మకం కూడా ఎవరిలోనూ లేదు. ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ పార్టీ క్రమక్రమంగా ఎదుగుతోంది.

 ఇలాంటి నేపథ్యంలో  జగన్మోహన్ రెడ్డి కి గుడ్ బాయ్ చెబుతున్నారు కీలక నేతలు. అయితే తాజాగా వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలేటట్లు కనిపిస్తోంది. అతి త్వరలోనే జిల్లాల యాత్రకు వైయస్ జగన్మోహన్ రెడ్డి బయలుదేరబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. అయితే ఆయన ప్రకటన రాగానే శ్రీకాకుళం జిల్లాలో వైసీపీ పార్టీకి ఊహించని ఎదురు దెబ్బ తగిలినట్లు సమాచారం అందుతుంది.

 మొన్నటి వరకు వైయస్ జగన్మోహన్ రెడ్డి  ప్రభుత్వంలో కీలక పదవులు అనుభవించిన ధర్మాన ప్రసాద రావు... వైసీపీకి గుడ్ బై చెప్పే యోచనలో  ఉన్నారట. దీనికి కారణం.. జనసేన నుంచి మంచి ఆఫర్ వచ్చిందట ధర్మాన ప్రసాదరావుకు..! అందుకే శ్రీకాకుళం వైసిపి ఇన్చార్జి పదవి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ ధర్మాన ప్రసాదరావు మాత్రం దానికి ఓకే చెప్పలేదట.  దీంతో ఆయన వైసిపి పార్టీని వీడి జనసేన  పార్టీలోకి వెళ్తారని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: