ఏడాది సీఎం రేవంత్ రెడ్డి....కేసీఆర్‌ ను మరిచిపోయేలా చేశాడా ?

Veldandi Saikiran
తెలంగాణ రాష్ట్రంలో... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. గత డిసెంబర్ నెలలో... తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే ఆ ఫలితాలలో 64 సీట్లు సంపాదించుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేజిక్కించుకుంది. దీంతో 10 సంవత్సరాలకు గులాబీ పార్టీ... ప్రతిపక్షంలో కూర్చోవడం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు..

పార్టీ కోసం కష్టపడ్డాడని అతని కృషిని గుర్తించిన కాంగ్రెస్ పార్టీ... ముఖ్యమంత్రి పీఠాన్ని అందించింది. అయితే డిప్యూటీ ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క... మంత్రులుగా కోమటిరెడ్డి లాంటి నేతలు ఉన్నారు. అయితే ఏడాదికాలంగా...  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూర్చి పోరు కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు ఏ కాంగ్రెస్ నేత... తనకూర్చి కబ్జా చేస్తాడు అనే భయంతోనే రేవంత్ రెడ్డి ఏడాది పాలన కొనసాగిందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఇక ఆరు గ్యారెంటీలో అమలు చేస్తామన్న కాంగ్రెస్... ఉచిత బస్సు మినహా ఏ ఒక్క హామీని నెరవేర్చలేకపోయిందని జనాలు సైతం.. అంటున్నారు. ఈ 6 గ్యారంటీలు అమలు చేయడంలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందని విపక్షాలు మండిపడుతున్నాయి.  ఇక వీటితో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగ పూర్తిగా డమాల్ అన్నది అంటూ గులాబీ పార్టీ నేతలు చెబుతున్నారు.  హైడ్రా పేరుతో హైదరాబాదులో కూల్చివేతలు చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. అయితే హైడ్రా అనేది మంచిదైనప్పటికి...  హైడ్రాకు భయపడి కొంతమంది హైదరాబాదులో ఫ్లాట్లు అలాగే ఇండ్లు కట్టుకునేందుకు ఆసక్తి చూపించలేదని సర్వేలు చెబుతున్నాయి.

ఇటు మూసి సుందరీకరణ పేరుతో కూల్చివేతలకు తెరలేపింది రేవంత్ రెడ్డి సర్కార్. అయితే అక్కడ విపక్షాలన్నీ ఏకమై పోరాటం చేయడంతో వెనక్కి తగ్గింది. ఇక రెండు లక్షల రుణమాఫీ విషయంలో... చాలామంది రైతులకు న్యాయం జరిగిందని చెప్పవచ్చు. కొంత వ్యతిరేకత వచ్చినా.. పథకం మాత్రం బాగానే అమలుకావడం జరిగింది. ఇక కెసిఆర్ పేరును  మర్చిపోయేలా అనేక  నిర్ణయాలు తీసుకుంది రేవంత్ రెడ్డి సర్కార్  కానీ జనాలు మాత్రం కెసిఆర్ పేరుని తలపిస్తున్నారని.. మరి కొన్ని సర్వేలు తేల్చాయి. మొత్తానికి కెసిఆర్ అభివృద్ధి చేసినట్లుగా రేవంత్ రెడ్డి చేయడం లేదని ఒక వాదనైతే ప్రజల్లో ఏర్పడిందని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: