వైసీపీకి బిగ్ షాక్... మేకతోటి సుచరిత సంచలన నిర్ణయం...?

Veldandi Saikiran
వైయస్ జగన్మోహన్ రెడ్డికి మరో ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసిపి పార్టీని వరుసగా నేతలందరూ వీడుతున్నారు. ఈ నేపథ్యంలోనే.. మరో మహిళా నేత... వైసీపీని వీడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వైసిపి మాజీమంత్రి సుచరిత జగన్మోహన్ రెడ్డికి గుడ్ బై చెప్పబోతున్నారట. ఆమెకు కూటమి పార్టీల నుంచి బంపర్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.
 అందుకే అతి త్వరలోనే వైయస్ జగన్మోహన్ రెడ్డికి గుడ్ బాయ్ చెప్పి... జనసేన లేదా తెలుగుదేశం పార్టీలో చేరాలని ఆమె డిసైడ్ అయ్యారట. ఈ మేరకు తన అనుచరులతో సమావేశం అయ్యారట సుచరిత. అయితే సుచరితకు బాలినేని శ్రీనివాస్ రెడ్డి టచ్ లోకి వచ్చినట్లు సమాచారం. జనసేన పార్టీలోకి ఆమెను ఆహ్వానించారట. ఇప్పుడు వస్తే మంచి అవకాశాలు ఉంటాయని సుచరితకు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది.
 దీంతో ఐదేళ్లపాటు వైసీపీ అధికారంలోకి రాదని గ్రహించిన సుచరిత..  జంప్ అయ్యేందుకే  రెడీ అయినట్లు తెలుస్తోంది. వాస్తవంగా మొన్నటి ఎన్నికల్లో... ఎంపీ సీటు ఇస్తానని..  సుచరిత భర్తకు హామీ ఇచ్చారట వైయస్ జగన్మోహన్ రెడ్డి. కానీ టికెట్లు ప్రకటించే సమయానికి నిరాశ ఎదురైందని తెలుస్తోంది.  అలాగే ప్రతిపాడు కాకుండా..తాడికొండ టికెట్ సుచరితకు ఇవ్వడం జరిగింది
 దీంతో తాడికొండలో మేకతోటి సుచరిత దారుణంగా ఓడిపోయారు. ఎన్నికల కంటే ముందే జగన్మోహన్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడంతో ప్రతిఫలం రాలేదు. దాంతో అక్కడ టిడిపి కూటమి అభ్యర్థి గెలవడం జరిగింది. ఇటు ప్రతిపాడు బాధ్యతలను కూడా వేరే వ్యక్తికి జగన్ మోహన్ రెడ్డి ఇవ్వడం జరిగింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పార్టీ మారడం శరణ్యం అని ఆమె అనుకుంటున్నారట. దీంతో త్వరలోనే కూటమిలోని ఏదో ఒక పార్టీని ఎంచుకొని వెళ్లేందుకు, సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా బాలినేని శ్రీనివాసరెడ్డి  ఇప్పటికే జనసేన పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ద్వారానే సుచరిత కూడా జనసేనలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: