ఏపీ: తాడిపత్రిలో చంద్రబాబు ఆదేశాలు చెల్లవా..?
అయితే లాటరీ పద్ధతి ద్వారా మద్యం షాపులు పొందినటువంటి వారు.. కనీసం వారిని దుకాణాలను కూడా పెట్టనివ్వకుండా చేస్తున్నటువంటి విధంగా ప్రభాకర్ రెడ్డి అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారట. దీంతో మద్యం దుకాణాలు ఏర్పాటు కోసం షాపులు ఇవ్వకుండా అడ్డుపడుతున్నారట. తాడిపత్రిలో మద్యం షాపులన్నీ కూడా తనకే ఉండాలని ద్వారణంలో వ్యవహరించారంటూ దీంతో జెసి ప్రభాకర్ రెడ్డి నుంచి తమకు ప్రాణహాని ఉందంటూ.. పలు రకాల వ్యాపార దారులు ఈనెల 5వ తేదీన అనంతపురం కలెక్టర్ జిల్లా వినోద్ కుమార్కు, ఎక్సైజ్ కమిషనర్ కు సైతం కంప్లైంట్ చేశారట.
అయితే సీఎం చంద్రబాబు మాత్రం మద్యం దుకాణాలను ఎవరు ఇబ్బంది పెట్టకూడదని ఎలాంటి కమిషనర్ తీసుకోకూడదని విధంగా హెచ్చరించినప్పటికీ తాడిపత్రిలో సీఎం చంద్రబాబు ఆదేశాలు ఏం మేరకు చెల్లలేదనే విధంగా ప్రభాకర్ రెడ్డి వ్యవహరిస్తూ ఉండడంతో చాలామంది ప్రజలతో పాటు వ్యాపారస్తులు అక్కడ నేతలు కూడా విసిగిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. గతంలో కూడా సీఎం చంద్రబాబు పిలిపించిన కూడా ప్రభాకర్ రెడ్డి సీఎం దగ్గరకు వెళ్లకుండా ఉన్నారనే విధంగా టాక్ వినిపించింది.. ఈ విషయం పైన చంద్రబాబు మరొకసారి ఏ విధంగా మాట్లాడుతారో చూడాలి మరి.