ఏపీ రాయలసీమ: ఆ మాజీ మంత్రి వైసిపి పార్టీలోకా.. ఇదేం ట్విస్ట్..!

Divya
ఉమ్మడి అనంతపురం జిల్లాలో శింగనమల నియోజకవర్గం రాజకీయాలలో ఎప్పుడూ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.. 2024 ఎన్నికలలో భాగంగా టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు కి వైసీపీ నుంచి టికెట్ కేటాయించడంతో ఒక్కసారిగా చర్చనీ అంశంగా మారింది. చదువుకున్న వారికే కాకుండా సామాన్యులకు కూడా వైసీపీ పార్టీలో స్థానం ఉంటుందనే విధంగా టికెట్ ఇచ్చి మరి చూపించారు. 2019లో అదే స్థానంలో జొన్నలగడ్డ పద్మావతి టికెట్ ఇచ్చి వైసిపి ఎమ్మెల్యేగా గెలిచింది.. అయితే 2024లో టిప్పర్ డ్రైవర్ కి ఇచ్చిన టికెట్ ఓటమిపాలు అయ్యింది.


అయితే ఎన్నికలు అయిపోయి ఇప్పుడు ఆరు నెలలు కావస్తూ ఉన్న వరుస పెట్టి జగన్ మోహన్ రెడ్డి నియోజవర్గాల వారిగా కొత్త ఇన్చార్జిలను సైతం ఎంపిక చేయడం జరుగుతోంది. ఈ విధంగా చూస్తే శింగనమలలో కూడా కొత్త ఇన్చార్జి వైసీపీ నుంచి రాబోతున్నారని టాక్ వినిపిస్తోంది. అధికారంలో ఉన్న కూటమిని దీటుగా ఎదుర్కోవాలి అంటే ఒక బలమైన అభ్యర్థి కోసం జగన్ ఆలోచిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. టిప్పర్ డ్రైవర్ వీరాంజనేయులు మంచి వ్యక్తి అయిన ఆర్థికంగా స్తోమత లేని వారు కావడం చేత ఆయన ప్లేసులో ఒక బడా లీడర్ని తీసుకువచ్చే ప్రయత్నం అయితే ఇప్పుడు జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అయితే నియోజవర్గంలో జరుగుతున్న ప్రచారాన్ని బట్టి చూస్తే మాజీ మంత్రి శైలజనాధుని వైసీపీ పార్టీ ఆహ్వానించి ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే నియోజకవర్గం లోనే కాదు ఏపీలోనే కొంతమేరకు షాక్ అని చెప్పవచ్చు. కాంగ్రెస్ నుంచి మంచి పేరున్న నేతగా ఉన్న శైలజానాథ్ వైసీపీ పార్టీలోకి చేరుతారు అంటే అది ఆ పార్టీకి కూడా ప్రెస్ అవుతుందని చాలామంది భావిస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ ప్రచారం నిజం ఐతే వచ్చే జనవరిలో శైలజనాద్ వైసీపీ పార్టీలోకి వెళ్లబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం టిడిపి పార్టీ ఎమ్మెల్యేగా బండారు శ్రావణి ఉన్నది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: