ప్రజారాజ్యం బాటలోనే జనసేనా... అన్న తప్పులే తమ్ముడు రిపీట్... !
అయితే జనసేన నుంచి గెలిచిన 21 మంది ఎమ్మెల్యే లలో కూడా 12 మంది కాపులే ఉన్నారు. ఆ పార్టీ నుంచి కొద్ది రోజుల క్రితం ఫస్ట్ ఎమ్మెల్సీ అయిన వ్యక్తి కూడా అదే సామాజిక వర్గం. ఇక జనసేన నుంచి గెలిచిన ఇద్దరు ఎంపీలు మచిలీపట్నం వల్లభనేని బాలశౌరి తో పాటు కాకినాడ నుంచి గెలిచిన టీ టైం ఉదయ్ శ్రీనివాస్ ఇద్దరూ కూడా కాపులే. ఇక జనసేన ఇచ్చిన ముగ్గురు మంత్రి పదవులలో పార్టీ అధినేత .. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాపు నేత.. మరో మంత్రి కందుల దుర్గేష్ కాపు వర్గానికే చెందిన వారు. ఇక మరో మంత్రి నాదెండ్ల మనోహర్ కమ్మ నేత. అయితే ఇప్పుడు పవన్ సోదరుడు నాగబాబుకు కూడా మంత్రి పదవి ఇవ్వడం ఫిక్స్ అయ్యింది. నాగబాబు కూడా కాపే. ఏది ఏమైనా ప్రజారాజ్యం పార్టీ కి కాపు పార్టీ గా ఎలా అయితే ముద్ర పడిందో.. ఇప్పుడు జనసేన పై కూడా అదే ముద్ర పడిపోయే ప్రమాదం అయితే స్పష్టంగా కనిపిస్తోంది.