నాగబాబుకు ఏ శాఖ ఇవ్వనున్నారో? మంత్రితో పాటు ఎంపీ కూడానా?
ఇకపోతే, ఏపీ కేబినెట్లో గత 6 నెలలుగా ఓ బెర్తు ఖాళీగా ఉంది. కూటమి సమీకరణాల నేపథ్యంలో వీలు చూసుకుని దానిని భర్తీ చేద్దామని చంద్రబాబు అనుకున్నారు. మరోవైపు తిరుపతి లడ్డూ వివాదం తర్వాత జాతీయ స్దాయిలో పవన్ కళ్యాణ్ హవా భారీగా పెరిగింది. ఎంతలా అంటే, ఏ రాష్ట్రంలో ఎన్నికలు జరిగినా పవన్ ను పిలిచి ప్రచారం చేయించేందుకు బీజేపీ చాలా ఆసక్తిని కనబరుస్తోంది. ఏపీలో ఎలాగో ఇప్పట్లో ఎన్నికలు లేవు. కాబట్టి ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేయడానికి పవన్ పచ్చ జెండా ఉపుతున్నారు. ఈ క్రమంలోనే పవన్ కి ఉన్న ఛరిష్మాను పూర్తి స్ధాయిలో ఉపయీగించుకోవాలని భావిస్తున్న కాషాయ దళం ఆయన్ని రాబోయే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లోనూ వాడుకునేందుకు సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది.
ఇలా వరుస ఎన్నికల్లో వాడుకుంటూ పవన్ కు తిరిగి ఏదీ ఇవ్వకపోతే బాగోదని వారికి బాగా తెలుసు. దీంతో ఎలాగో తమ గూట్లో ఉన్న పవన్ ను ఎంపీని చేసి కేంద్రమంత్రి పదవి ఇచ్చేందుకు బీజేపీ ఉత్సాహంగా ఉన్నట్టు చాలా స్పష్టంగా కనబడుతోంది. ఈ మేరకు ఇప్పటికే ఆయనకు సంకేతాలు ఇవ్వడంతో తాజా పరిణామాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ పెద్దల సూచన మేరకే పవన్ కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని బావించి కూడా చివరికి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు అవకాశం రావడంతో కేంద్రంలోకి వెళ్లేందుకు పవన్ ఆసక్తి చూపుతున్నట్లు కనబడుతోంది. బీజేపీకి నమ్మకమైన మిత్రుడిగా మారిన పవన్ తో భవిష్యత్తులో బీజేపీకి చాలా అవసరం ఉంది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకునే తన స్ధానంలో కేబినెట్లోకి అన్న నాగబాబును పవన్ పంపుతున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.