ఏపీ: సీఎం చంద్రబాబులో ఉన్న గొప్పతనం ఆదే..?

Divya
సాధారణంగా చాలామందికి ఇవాళ 20 పాతికేళ్లు వచ్చేసరికి.. ఓపిక ఉండడం లేదు.. ఏదైనా ఆనుకొని పడుకోకపోతే కుదరడం లేదు.. ఎక్కువ పని చేయడం అంటే బద్ధకం అని కూడా చెప్పవచ్చు.. తాగడానికి తినడానికి కూడా మిగతా వాటిలలో బద్దకాలు కూడా పెరిగిపోతున్నాయి. 40 ఏళ్లు వచ్చాయి అంటే చాలు గోడలకి ఆనుకోవడం ఏదైనా పని చెబితే మా చేత కాదని చెప్పడం వంటివి చేస్తూ ఉన్నారు.. 50 ఏళ్లు దాటాయింటే చాలు మా ఓపిక లేదంటూ పక్కన కూర్చుంటున్నారు..

కానీ చంద్రబాబు మాత్రం ఆయన ఏంటో మరొకసారి నిరూపించారు.. ఆరు నెలలు అయింది చంద్రబాబు పరిపాలన మొదలుపెట్టి.. రెండవ కలెక్టర్ల మీటింగ్.. మొదట్లో అప్పుడు చెప్పారు ఇప్పుడు రెండో మీటింగ్.. దాదాపుగా 10 గంటలపాటు ఏకధాటిగా కలెటర్ల మీటింగ్లో కూర్చుంటున్నారు. మధ్యలో లేచి వెళ్లిపోవడం వంటివి కూడా చేయలేదట.. మంత్రులందరూ కూడా మాట్లాడేది విన్నారు.. తాను చెప్పాలనుకున్నది కూడా చెప్పారు.. కలెక్టర్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా విన్నారట. అలాగే సీఎం చంద్రబాబు చెప్పాలనుకున్న సలహాలను కూడా చెప్పారట.

ప్రజా సంబంధ అంశాల విషయంలో ఓపిక.. గంటలు గంటలు అలా కూర్చునే ఉంటున్నారట చంద్రబాబు.. సాధారణంగా ఓపిక ఉండదు లేకపోతే కొంతమందికి అసహనం మొదలవుతుంది.. జగన్ సమయంలో కూడా మీటింగులు జరిగాయి.. మధ్యాహ్నం రెండు కళ్ళ ముగించేవారు. ఆ తర్వాత ఎవరి పని వారు చేసుకునేవారు.. కానీ సీఎం చంద్రబాబు వచ్చేసరికి.. సాయంత్రం వరకు ఎడతెరపు లేకుండా మీటింగ్లు చేస్తున్నారట.. మంత్రులకే ఓపిక లేక కాళ్లు రుద్దుకునే వాళ్ళ.. ఒళ్ళు ఒత్తుకునేటువంటి వారు.. అంత నీరసం ఉన్నవారు కనిపిస్తూ ఉన్నప్పటికీ.. అలాగే కలెక్టర్లకు కూడా ఓపిక లేకుండా కనిపిస్తూ ఉన్నారు.. అదే చంద్రబాబు గారైతే.. పొద్దున్నే ఎలా చిరునవ్వుతో వచ్చారు సాయంత్రం అలాగే కూర్చుని ఉన్నారట.. అది చంద్రబాబులో ఉన్నటువంటి స్పెషాలిటీ.. 70 ఏళ్లలో కూడా తెలుగుదేశం పార్టీకి అతిపెద్ద ఎసెట్ ఇదే అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: