తెలంగాణ: అమల్లోకి రానున్న కొత్త సిస్టం..జేబులో చిల్లి గవ్వ లేకున్న ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం.!

FARMANULLA SHAIK
ఆర్టీసీ బస్సులు ఎక్కే చాలా మంది ప్రయాణికులకు ఎదురయ్యే ప్రధాన సమస్య చిల్లర. టికెట్టు కు సరిపడా చిల్లర ఇవ్వాలని బస్సులో పెద్ద పెద్ద అక్షరాలతో రాసి పెట్టినా చాలా మంది ప్రయాణికులకు పెద్ద నోట్లతో బస్సులు ఎక్కుతుంటారు. టికెట్ ఇచ్చిన తర్వాత చిల్లర లేక కండక్టర్లు నానా ఇబ్బందులు పడుతుంటారు. చిల్లర విషయం లో కండక్టర్లకు, ప్రయాణికుల కు తీవ్ర స్థాయిలో గొడవలు జరిగిన ఘటనలు మనం చూశాం. కొన్ని సార్లు ఆ గొడవలు చేయి చేసుకునే వరకు కూడా వెళ్లాయి.ఈ చిల్లర సమస్యతో విసిగిపోయిన చాలా మంది బస్సుల్లోనూ డిజిటల్ పేమెంట్లు పెడితే బాగుంటుందనే అభిప్రాయాన్ని చాలా కాలంగా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్టీసీ అధికారులు గుడ్‌న్యూస్ చెప్పారు.అదేమిటంటే ఆర్టీసీ బస్సుల్లో ఇకపై ఆన్ లైన్ లో చెల్లింపులకు అవకాశం రానుంది. ఆన్ లైన్ పేమెంట్స్ కోసం సంస్థ యాజమాన్యం అన్ని ఏర్పాట్లను పూర్తి చేసింది. ఆన్ లైన్ చెల్లింపులు జరిపేందుకు ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ ఏఎఫ్‌సీఎస్ మెషీన్లు ఇప్పటికే సంస్థకు చేరాయి. గత కొన్ని నెలల కింద వీటికోసం ఆర్టీసీ ఆర్డర్ పెట్టగా ఇటీవలే ఈ ఆన్ లైన్ పేమెంట్ మెషీన్లు సంస్థ చేతికి వచ్చాయి. ఇక త్వరలోనే ప్రయాణికులు అన్ని రకాల బస్సుల్లో ఆన్ లైన్ పేమెంట్ చేసే వీలు ఉంటుంది. ఈ ఆన్లైన్ టికెట్ విధానం ద్వారా ప్రస్తుతానికి ఎటువంటి సమస్యలు రావటం లేదని ఆర్టీసీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో త్వరలోనే నగరంలోని అన్ని రూట్లలో ఆన్లైన్ పేమెంట్ టికెటింగ్ విధానాన్ని అమలు చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ పేమెంట్ విధానం అమల్లోకి వస్తే.. ప్రయాణికులకు, కండక్టర్లకు చిల్లర తిప్పలు తప్పనున్నాయి.ఇదిలావుండగా ఫోన్లు లేని వారు నగదు చెల్లించి కూడా టికెట్ తీసుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: