గోదావ‌రిలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ‌... టాప్ వికెట్లు ట‌పాట‌పా..?

RAMAKRISHNA S.S.
సాధారణ ఎన్నికలలో ఘోర పరాజ‌యం తర్వాత ఉభయగోదావరి జిల్లాలలో వైసీపీకి దెబ్బ మీద దెబ్బ పడుతోంది. కీలక నాయకుల ఒక్కొక్కరు ఆ పార్టీని వీడుతున్నారు. వరుస రాజీనామాలతో కార్యకర్తలు డీలా పడుతున్నారు. తాజాగా గురువారం భీమవరం మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ రాజీనామా చేయడంతో పార్టీలో అలజడి మొదలైంది. 2019 ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచిన జగన్ తనకు పార్టీలో ఎలాంటి గౌరవం ఇవ్వలేదని ఆయన ప్రకటించారు. వైసీపీని వీడిన గ్రంధి శ్రీనివాస్ త్వరలోనే టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. సార్వత్రిక ఎన్నికల ముందు వరకు టిడిపిలో ఉన్నా సీనియర్ నాయకుడు పులపర్తి రామాంజనేయులు జనసేనలో చేరి గ్రంధి పై గెలిచి జనసేన ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ టిడిపిలో చేరాలన్న నిర్ణయానికి వచ్చినట్టు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల ఫలితాలు అనంతరం ఉభ‌య‌ గోదావరి జిల్లాలలో వైసీపీకి తరచూ పెద్ద ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏలూరు మేయర్ పెదబాబు దంపతులు ... ఆ తర్వాత పెద్ద సంఖ్యలో వైసిపి కార్పొరేటర్లు టిడిపి గూటికి చేరిపోయారు. కీలక నాయకులైన బద్దాన్ని శ్రీనివాస్ .. మంచెం మై బాబు సైతం వైసీపీకి టాటా చెప్పేశారు. వైసిపి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న మాజీ ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని రాజీనామాతో జిల్లాలో పార్టీకి పెద్ద దెబ్బ పడింది. ఇటీవల కొల్లేరు లో ముఖ్య నేతగా ఉన్న జయ మంగళ వెంకట రమణ ఏకంగా ఎమ్మెల్సీ పదవికి .. పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా గ్రంధి శ్రీనివాస్ వైసీపీని వీడి వెళ్లడంతో పశ్చిమ వైసిపి లోను ముస‌లం మొదలైంది. మరి కొంతమందిది అదే బాట అని తెలుస్తోంది. ఓవైపు జగన్ కూటమి ప్రభుత్వంపై పోరాటాలకు పిలిపిస్తున్న తరుణంలో క్షేత్రస్థాయిలో నడిపే నాయకులు ఒక్కొక్కరుగా బయటకు వెళ్ళిపోతూ ఉండటం వైసీపీకి మింగుడు పడని అంశంగా మిగిలింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: