ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జనసేన పార్టీకి మంచి రోజులు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం అలాగే వైసిపి పార్టీ కంటే... ఆర్థికంగా చాలా వెనుకబడి ఉంది జనసేన పార్టీ. కేవలం పవన్ కళ్యాణ్ సంపాదనపైన ఆ పార్టీ ఆధారపడి ఉండడం జరిగింది. బ్యాంకు బ్యాలెన్స్ కూడా పెద్దగా లేదు. అయితే ఇలాంటి నేపథ్యంలో వైసిపి పార్టీలో కీలకమైన, అలాగే ఆర్థికంగా బలంగా ఉన్న నేతలందరూ.... జనసేన వైపు వస్తున్నారు.
ఇప్పటికే బాలినేని శ్రీనివాసరెడ్డి తో పాటు కిలారి రోశయ్య ఇలా మరికొంతమంది నేతలు ఇప్పటికే జనసేన పార్టీలో చేరారు. ఈ లీడర్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఆర్థికంగా ఎదిగారు. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కానీ అధికారం మాత్రం ఈ నాయకుల దగ్గర లేదు. అందుకే తెలుగుదేశం పార్టీలో స్పేస్ లేకపోవడంతో జనసేన వైపు వస్తున్నారు. తాజాగా వైసిపి పార్టీకి రాజీనామా చేసిన మరో ఇద్దరి లీడర్లు జనసేన వైపు వెళ్తున్నారు.
అవంతి శ్రీనివాస్ అలాగే గ్రంధి శ్రీనివాస్... ఈ ఇద్దరు లీడర్లు... జనసేనలోకి వెళ్లేందుకు డిసైడ్ అయ్యారట. అయితే ఇద్దరు లీడర్లకు వ్యాపారాలు భారీగానే ఉన్నాయి. ఆర్థికంగా చాలా దృఢంగా ఉన్నారు. ఇలాంటి నేతలు మరికొంతమంది వస్తే... జనసేన ఆర్థికంగా బలంగా తయారవుతుంది. అప్పుడు 20 స్థానాల నుంచి... కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా.. సింగిల్ గా పోటీ చేసే ఛాన్స్ వస్తుంది.
మొన్నటి ఎన్నికల్లో ఆర్థికంగా బలంగా లేకపోవడం కారణంగానే.. పవన్ కళ్యాణ్ ఎక్కువ సీట్లు అడగలేకపోయాడు. కానీ ఇప్పుడు... జనసేనకు మంచి రోజులు వస్తున్నాయి. వైసీపీలో బలంగా ఉన్న నేతలందరూ... జనసేన ను భర్తీ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లోపు మరికొంతమంది బలమైన లీడర్లు వస్తే... కచ్చితంగా కూటమి నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సింగిల్ గా పోటీ చేసి... ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ కూడా ఉంటుంది.