రేవంత్‌రెడ్డి గ్రీన్‌సిగ్నల్ తోనే అల్లు అర్జున్ అరెస్ట్ ... ?
అలాగే అల్లు అర్జున్ అరెస్టు విషయంలో మరో రెండు విషయాలు కూడా చర్చకు వస్తున్నాయి. చట్టం ప్రకారం అరెస్టు చేయాల్సి ఉందని అనుమతి తీసుకోవడం ఒకటి అయితే... రెండు అరెస్టు చేయమని తన వైపు నుంచి సంకేతాలు వెళ్లడం కూడా ఉంటుందంటున్నారు. ఇక్కడ రేవంత్ రెడ్డి అనుమతి ఇచ్చి ఉంటారని.. తనను అరెస్టు చేయమని సూచించే పరిస్థితి అయితే ఎంత మాత్రం ఉండదని అంటున్నారు. అసలు రేవంత్ రెడ్డి నిజంగానే అల్లు అర్జున్ అరెస్టు విషయంలో ఎందుకు ? గ్రీన్ సిగ్నల్ ఇస్తారన్న ప్రశ్న కూడా చర్చించాల్సిందే.
వాస్తవానికి సినిమా ఇండస్ట్రీ రేవంత్‌రెడ్డిని చాలా లైట్ తీస్కొంది. కేసీఆర్ పదేళ్ల పాలనలో సినిమా వాళ్లను తొక్కి పెట్టడంతో వాళ్లంతా ప్రభుత్వానికి.. బీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నోరెత్తే ప్రయత్నమే చేయలేదు. ఇక రేవంత్‌రెడ్డి గెలిచాక కూడా సినీ ఇండస్ట్రీ నుంచి ఒకరిద్దరు మినహా పెద్దగా ఎవ్వరూ కనీసం అభినందించలేదు సరికదా.. చాలా మంది అయితే సోషల్ మీడియాలోనూ పట్టించుకోలేదు. గత యేడాదిగా ఇది కనపడుతూనే ఉంది.
చివరకు రేవంత్‌రెడ్డి పేరు పలికేందుకు కూడా చాలా మంది ఇష్టపడటం లేదు. దీనిని రేవంత్ సీరియస్‌గా తీసుకున్నారా ? గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో ఇండస్ట్రీకి ఎప్పటకీ గుర్తుండిపోయేలా తన దెబ్బేంటో చూపించారు. ఇప్పుడు కూడా ఈ ఐదేళ్ల పాటు రేవంత్ అంటే ఏంటో గుర్తుండేలా సంథ్య థియేటర్ ఘటనను సీరియస్‌గా తీసుకున్నారా ? అన్న సందేహాలు ఉన్నాయి. ఒక్కటి మాత్రం నిజం.. ముఖ్యమంత్రికి తెలియకుండా పాన్ ఇండియా స్టార్ హీరోను అరెస్టు చేసేందుకు ఎంత మాత్రం ఛాన్స్ ఉండదు.