అల్లు అర్జున్‌రెడ్డిని పూర్తిగా ఓన్ చేసుకున్న వైసీపీ...?
బన్నీ కూడా పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. ఇక ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన తన సోదరుడు శిల్పా రవి కిషోర్ రెడ్డికి తన భార్య స్నేహ రెడ్డితో కలిసి వెళ్లి మరి మద్దతు తెలిపి వచ్చాడు. అక్కడితో ఆగకుండా తనకు నచ్చితే ఎవరు అయినా ఎక్కడ ఉన్నా వస్తాను అంటూ కామెంట్ చేశాడు. ఓవైపు మామయ్య పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టి వైసిపి పై పోరాటం చేస్తుంటే ? అదే వైసిపి అభ్యర్థికి బన్నీ సపోర్ట్ చేయటం జనసేనతో పాటు మెగా అభిమానులకు నచ్చలేదు. నాగబాబు సైతం ఇన్ డైరెక్ట్ గా కౌంటర్ వేశాడు. ఇక పుష్ప 2 సినిమాను మెగా అభిమానులు చాలామంది జనసేన అభిమానులు.. పవన్ అభిమానులు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. అదే టైంలో వైసిపి వాళ్లు ఈ సినిమాను బాగా ఓన్ చేసుకున్నారు.
ఇక ఈరోజు అల్లు అర్జున్ అరెస్టు చేసిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తో పాటు వైసీపీకి చెందిన పలువురు కీలక నేతలు ఈ అరెస్టు అక్రమం అంటూ.. అన్యాయం అంటూ సోషల్ మీడియా వేదికగా కండనలు ఇచ్చారు. వైసిపి కేడర్లో చాలామంది మరి ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం అయితే అల్లు అర్జున్ ను తమ వాడిగా ఓన్ చేసుకున్నారు. ఎందుకంటే అల్లు అర్జున్ భార్య స్నేహ రెడ్డి వైసీపీ అధినేత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి అన్న విషయం తెలిసిందే. దీంతో సోషల్ మీడియాలో అల్లు అర్జున్ మావాడు అంటూ వైసీపీని బాగా అభిమానించే రెడ్డి సామాజిక వర్గం కామెంట్లు పెడుతుంది.